కన్నడ సినిమా కాంతార బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో కూడా విజయవంతంగా దూసుకుపోతుంది. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి ఊహించని కలెక్షన్స్ రాబడుతుంది.
కన్నడలో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కొత్త రికార్డ్ నమోదు చేసింది. 50రోజులు దాటిన కూడా థియేటర్లలో సత్తా చాటుతుంది. అయితే ఈ సినిమా తాజాగా కేజీఎఫ్ 2 రికార్డ్ ను బ్రేక్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ. 400కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మొదట సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైంది. ఇతర భాషా ప్రేక్షకుల నుంచి డిమాండ్ రావడంతో వాటిలో డబ్ చేసి విడుదల చేశారు. అయితే ఈ సినిమాకి విడుదలైన అన్ని భాషల్లో మంచి ప్రశంసలు అందుకుంది.
కన్నడ చిత్రాలు పాన్ ఇండియా వైడ్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాయి. ‘కేజీయఫ్’తో రాకీభాయ్ దేశాన్నిషేక్ చేశాడు.‘కేజీయఫ్’ హిట్ ఒక ఎత్తైతే, ఆ తరువాత వచ్చిన ‘కేజీయఫ్ 2’ మరో లెవెల్. ఇక దీంతో కన్నడ సినీ పరిశ్రమ వెలిగిపోతోంది. అయితే తాజాగా ‘కేజీయఫ్’ రికార్డు ను కాంతార దాటేసింది. అయితే ఇక్కడ ఒక సందేహం రాకమానదు. ఎందుకంటే ‘కేజీయఫ్ 2’మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 1250 కోట్లు సాధించింది. అయితే ఇక్కడ చెప్పేది కర్ణాటక రాష్ట్రంలోని కలెక్షన్స్ గురించి మాత్రమే.‘కేజీయఫ్ 2’మూవీ రూ.172 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా వసూలు చేసింది.
తాజాగా ఆ కలెక్షన్స్ ను ‘కాంతార’ 60 రోజుల్లోనే క్రాస్ దాటేసిందట. ఇక దీంతో కన్నడ ఇండస్ట్రీలో ‘కాంతార’ మూవీనే టాప్. అయితే రెండు సినిమాలకు మధ్య చాలా తేడాలు ఉన్నాయి. కేజీయఫ్ 2 బడ్జెట్ రూ. వందల కోట్లలో ఉంటే, ‘కాంతార’ బడ్జెట్ రూ.16కోట్లు. కథనే నమ్ముకుని ‘కాంతార’ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ రెండు సినిమాలను నిర్మించింది హోంబలే ఫిల్మ్స్.

అయితే రిషబ్ శెట్టి తాజాగా విడుదలైన కాంతారాతో స్టార్డమ్లో కొత్త శిఖరాలకు చేరుకున్నాడు. బాక్సాఫీస్ కలెక్షన్ల నుంచి రివ్యూల వరకు ప్రతి విషయంలోనూ సినిమా అద్భుతంగా రాణించింది. ఇక రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూ లో రష్మిక మీద అసహనం వ్యక్తం చేశాడు. ఆమెతో పని చేయడానికి ఆసక్తి లేదనట్టుగా మాట్లాడాడు. రష్మిక గతంలో తన ఫస్ట్ సినిమా హౌస్ పేరు చెప్పకుండా చూపించిన సైగలను ఇమిటేట్ చేసి,తన వేళ్లను చూపించి ‘ఇస్ టైప్ కే యాక్ట్రెస్’ అన్నాడు.
ఇక దీనిపై తాజాగా రిషబ్ శెట్టి స్నేహితుడు, నటుడు ప్రమోద్ శెట్టి ఒక యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ, రష్మిక తన జీవితాన్ని తాను నిర్మించుకుంది. ఆమెకు కూడా సినిమా అంటే ఇష్టం. సినిమా చూడకుంటే ఫర్వాలేదు, తన సినిమాలతో బిజీ అయి ఉండవచ్చు. ఆమెకు ఆమె స్పేస్ ఇవ్వండి. ఎక్కడ జీవితం మొదలు పెట్టమో, అక్కడే ఉండిపోవాలని లేదు. ఉన్నత స్థానాలకు ఎదగాలి. రష్మిక ప్రస్తుతం అదే చేస్తుంది అని ప్రమోద్ అన్నాడు.
ప్రమోద్ చివరగా రష్మికకు, రష్మిక పై కామెంట్ చేసేవాళ్లకు ఒక మాట చెప్పాడు.కెరీర్లో మొదటి విజయాన్ని ఇచ్చిన వాళ్లను మరచిపోకూడదు. వాళ్ళను ఇబ్బంది పెట్టేలా కామెంట్స్ చేయకూడదు. ఎదుగుతున్న వారిని కూడా విమర్శించకూడదని, ఒకవేళ అలా చేస్తే చిన్న పిల్లలు అవుతాము అంటూ ప్రమోద్ స్పందించాడు. మరి ఇప్పటికైనా ఈ చర్చ ఇక్కడితో ఆగుతుందో చూడాలి.