Ads
Rashmika vs Sandalwood: రష్మిక, శాండిల్ వుడ్ వివాదం పై, కాంతార సినిమా పై ఆమె చేసిన వ్యాఖ్యల గురించి రిషబ్ శెట్టి స్నేహితుడు, కన్నడ నటుడు ప్రమోద్ శెట్టి తాజాగా స్పందించారు. కొన్ని రోజులుగా ఈ విషయం పై చర్చలు జరుగుతున్నాయి.
Video Advertisement
దీనికి కారణం రష్మిక ఒక ఇంటర్వ్యూలో తన ఫస్ట్ మూవీ ప్రొడక్షన్ హౌస్ పేరును చెప్పకుండా సైగలతో చూపించింది. ఆ తరువాత రీసెంట్‌గా వచ్చిన కన్నడ బ్లాక్ బస్టర్ సినిమా ‘కాంతార’ను చూడలేదు అని తెలిపింది. ఆ సినిమా గురించి రష్మిక స్పందన చూసి కన్నడ అభిమానులు హర్ట్ అయ్యారు. ఇక ఆ సినిమాలకు సంబంధించిన నటులు కూడా చాలా హర్ట్ అయ్యారు. ఈ నేపద్యంలో సోషల్ మీడియాలో రష్మిక పై ట్రోల్స్, కామెంట్లు చేస్తున్నారు. ఈ చర్చ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.
అయితే రిషబ్ శెట్టి తాజాగా విడుదలైన కాంతారాతో స్టార్‌డమ్‌లో కొత్త శిఖరాలకు చేరుకున్నాడు. బాక్సాఫీస్ కలెక్షన్ల నుంచి రివ్యూల వరకు ప్రతి విషయంలోనూ సినిమా అద్భుతంగా రాణించింది. ఇక రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూ లో రష్మిక మీద అసహనం వ్యక్తం చేశాడు. ఆమెతో పని చేయడానికి ఆసక్తి లేదనట్టుగా మాట్లాడాడు. రష్మిక గతంలో తన ఫస్ట్ సినిమా హౌస్ పేరు చెప్పకుండా చూపించిన సైగలను ఇమిటేట్ చేసి,తన వేళ్లను చూపించి ‘ఇస్ టైప్ కే యాక్ట్రెస్’ అన్నాడు.
ఇక దీనిపై తాజాగా రిషబ్ శెట్టి స్నేహితుడు, నటుడు ప్రమోద్ శెట్టి ఒక యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ, రష్మిక తన జీవితాన్ని తాను నిర్మించుకుంది. ఆమెకు కూడా సినిమా అంటే ఇష్టం. సినిమా చూడకుంటే ఫర్వాలేదు, తన సినిమాలతో బిజీ అయి ఉండవచ్చు. ఆమెకు ఆమె స్పేస్ ఇవ్వండి. ఎక్కడ జీవితం మొదలు పెట్టమో, అక్కడే ఉండిపోవాలని లేదు. ఉన్నత స్థానాలకు ఎదగాలి. రష్మిక ప్రస్తుతం అదే చేస్తుంది అని ప్రమోద్ అన్నాడు.
ప్రమోద్ చివరగా రష్మికకు, రష్మిక పై కామెంట్ చేసేవాళ్లకు ఒక మాట చెప్పాడు.కెరీర్‌లో మొదటి విజయాన్ని ఇచ్చిన వాళ్లను మరచిపోకూడదు. వాళ్ళను ఇబ్బంది పెట్టేలా కామెంట్స్ చేయకూడదు. ఎదుగుతున్న వారిని కూడా విమర్శించకూడదని, ఒకవేళ అలా చేస్తే చిన్న పిల్లలు అవుతాము అంటూ ప్రమోద్ స్పందించాడు. మరి ఇప్పటికైనా ఈ చర్చ ఇక్కడితో ఆగుతుందో చూడాలి.
End of Article