ప్రస్తుతం ఇండియాలో వన్డే ప్రపంచ కప్ హడావిడి కొనసాగుతుంది. మరో పది రోజుల్లో ఈ టోర్నీ ముగియనుంది.వన్డే ప్రపంచ కప్ ముగిసిన వెంటనే నాలుగు రోజుల గ్యాప్ లో ఇండియా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కి సిద్ధమైంది. ఇందులో భాగంగా స్వదేశంలో ఐదు మ్యాచ్ లు ఆడనుంది. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 5 వరకు ఈ సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ వైజాగ్ వేదికగా జరుగుతుంది. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా ఇప్పటికే జట్టును ప్రకటించ భారత్ కూడా త్వరలో జట్టును ప్రకటించనుంది.
ఈ సిరీస్ కోసం సీనియర్ లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మాలకు విశ్రాంతి ఇచ్చి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సత్తా చాటిన ఆటగాలను ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. అయితే ఈ టోర్నీలో మెరుపులు మెరిపిస్తున్న రియాన్ పరాగ్ కు అవకాశం దక్కనున్నట్లు సమాచారం.
ఏడు అర్ధ శతకాలు సాధించిన రియాన్ టి20 లో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్ గా రికార్డ్ సృష్టించాడు. పది మ్యాచ్ లు ఆడగా 500 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. అలాగే బంతితో 11 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. అంతకుముందు జరిగిన దేవధర్ ట్రోఫీ లో సత్తా చాటిన రియాన్ ఐదు మ్యాచ్ లలో 354 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.అందులో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ కూడా ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరిగే టి20 సిరీస్ రియాన్ పరాగ్ ను జట్టిలోకి తీసుకోవచ్చు అని తెలుస్తుంది.
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించిన రియాన్ ఆట కంటే కూడా తన చేష్టలతో ఎక్కువ వార్తల్లో నిలిచేవాడు. సోషల్ మీడియాలో ఇతనికి ఓవర్ యాక్షన్ స్టార్ అనే పేరు కూడా ఉంది. దాంతో ఇప్పుడు, “ఇంత ఓవర్ యాక్షన్ చేసే ప్లేయర్ అవసరమా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో యూపీ తరఫున ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ కప్ ఆడిన బౌలర్లకు విశ్రాంతి ఇచ్చే నేపథ్యంలో భూవి కూడా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సిరీస్ కోసం సూర్య కుమార్ యాదవ్ లేదా రుతురాజ్ గైక్వాడ్ ను కెప్టెన్ గా నియమించవచ్చు అని తెలుస్తుంది.
Also Read:తెలుగు వారి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ధోని… ఏ సంస్థకి అంటే…