తెలుగు వారి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ధోని… ఏ సంస్థకి అంటే…

తెలుగు వారి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ధోని… ఏ సంస్థకి అంటే…

by Mounika Singaluri

Ads

భారత్ క్రికెట్ అభిమానులకు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పై ఉన్న అభిమానం తెలియనిది కాదు. అతని ఆటలోని ప్రత్యేకత అందరినీ ఆకట్టుకుంటుంది. నాయకుడిగా జట్టును నడిపించే తీరు ఇప్పటికి అందరికీ గుర్తుండే ఉంటుంది. ధోనిని మించిన కెప్టెన్ ఇండియాకి రాడు లేడు అంటే అది అతిశయోక్తి కాదు.

Video Advertisement

ధోనికి ఉన్న  ఆదరణను చూసి పలు కంపెనీలు ఆయనను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుని వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకుంటూ మరిన్ని లాభాలు సంపాదిస్తూ ఉంటాయి. అయితే తాజాగా హైదరాబాదుకు చెందిన తెలుగు సంస్థ మ్యాక్సీవిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ తన బ్రాండ్ అంబాసిడర్ గా ధోని ని నియమించుకుంది.

EDUCATIONAL QUALIFICATIONS OF OUR CRICKETERS..!!

ఈ సందర్భంగా మ్యాక్సీవిజన్ ఐ హాస్పిటల్ గ్రూప్ సీఈవో సుదీర్ మాట్లాడుతూ మ్యాక్సీవిజన్ లో మొత్తం 40+ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతిరోజు వేలాది మంది రోగులకు కంటికి సంబంధించిన సేవలు అందిస్తున్నాం. మారుతున్న జీవనశైలిలో భాగంగా చాలామంది గ్లూకోమా, రెటీనా వంటి సమస్యల వల్ల బాధపడుతున్నారు. మ్యాక్సీవిజన్ కంటి సంరక్షణ ప్రోత్సహించే లక్ష్యంతో ఆన్ లైన్, ఆఫ్ లైన్, ఆన్ గ్రౌండ్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఎంఎస్ ధోని వంటి ప్రముఖ వ్యక్తి ఇందులో భాగమవడం హర్షనీయమని అన్నారు.

స్పష్టమైన దృష్టితో క్రీడలు, జీవితంలో విజయాలు సాధించవచ్చు అని మ్యాక్సీవిజన్ ఐ హాస్పిటల్ బ్రాండ్ అంబాసిడర్ ఎంఎస్ ధోని అన్నారు. తరచూ కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా వాటిని  సంరక్షించుకోవచ్చు అని అన్నారు. ఈ రంగంలో మ్యాక్సీవిజన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఎంఎస్ ధోని తెలుగు సంస్కృతి బ్రాండ్ అంబాసిడర్ గా చేయడం తో  ఆయన తెలుగు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కెరీర్ స్టార్టింగ్ నుండి కూడా ధోని  నేషనల్ ,ఇంటర్నేషనల్ బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్నారు.క్రికెట్ నుండి రిటైర్ అయిపోయిన కూడా ధోని  కున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదనడానికి ఇదే నిదర్శనం.

 

Also Read:ఇదేందయ్యా ఇది…ఇలా కూడా అవుట్ అవుతారా.? బాంగ్లాదేశ్ వాళ్ళు ఇలా పగపట్టేసారు ఏంటి.?


End of Article

You may also like