టైం కి క్రీజ్ లోకి రాకపోవడం వల్ల కూడా అవుట్ అవుతారని తెలుసా.? టైం అవుట్ రూల్ గురించి అందరికి తెలిసే ఉంటది. కానీ ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలో అలా ఎవరు అవుట్ అవ్వలేదు అనుకుంట. శ్రీలంక బాట్స్మన్ ఏంజెలో మాథ్యూస్ ఇలా తొలిసారి అవుట్ అయ్యాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన శ్రీలంక జట్టు ఓవర్లలో 5 వికెట్లకు 149 పరుగులు చేసింది. 41 పరుగుల వద్ద సదీర సమరవిక్రమ ఔటయ్యాడు. షకీబ్ అల్ హసన్ బౌలింగ్ చేస్తున్నాడు.

Video Advertisement

ఈ క్రమంలో ఏంజెలో మాథ్యూస్ క్రీజులోకి రావాల్సి ఉంది. కానీ అతను టైం కి రాకపోవడంతో బంగ్లాదేశ్ టీం అంపైర్‌కు అప్పీల్ చేసింది. అంపైర్ అవుట్ గా ప్రకటించారు. అతను అసలు టైం అవుట్ ఎలా అయ్యాడు అంటే. క్రీజ్ లోకి సమయానికే వచ్చాడు… హెల్మెట్‌ను ధరించే సమయంలో ఓ పట్టీ విరిగిపోయింది. మరొక హెల్మెట్ రావడానికి ఆలస్యం జరిగింది.

క్రికెట్ రూల్ ప్రకారం వికెట్ పడిపోయిన 3 నిమిషాలలోపు బ్యాట్స్‌మన్ బంతిని ఆడటానికి సిద్ధంగా ఉండాలి. అలా జరగకపోతే ఆ ప్లేయర్ ని అవుట్ గా ప్రకటిస్తారు. సరిగా ఇదే రూల్ ని బాంగ్లాదేశ్ వాడుకుంది. ఆలస్యం అవ్వడంతో షకీబ్ అప్పీల్ చేసాడు. అంపైర్ అవుట్ గా నిర్ణయించాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే ఇలా అవుట్ అయిన తొలి ప్లేయర్ గా ఏంజెలో మాథ్యూస్ నిలిచాడు. పాపం ఒక బాల్ కూడా ఆడకుండానే పెవిలియన్ వైపు తిరిగాడు అతను. దీంతో నెటిజెన్స్ బాంగ్లాదేశ్ ఇలా పగపట్టేసింది ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.