భారతదేశంలో నిత్యం లక్షలాది మంది రైలులో ప్రయాణిస్తూ ఉంటారు. సామాన్య మధ్య తరగతి ప్రయాణికులకు అనువైన ప్రయాణం రైలు ప్రయాణమే. తక్కువ ధరలో తమ అనుకున్న గమ్యస్థానాలకు రైలులో వెళుతూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు రైల్వేస్టేషన్ లో ఎక్కువ సమయం గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి వారికోసం తక్కువ డబ్బుతోనే వసతి సదుపాయం కల్పించేందుకు IRCTC కొత్త సేవలను తీసుకువచ్చింది.
ముఖ్యంగా రైళ్లు ఆలస్యమైన పరిస్థితుల్లో, ఎక్కువ దూరం వెళ్లాల్సిన పరిస్థితిల్లో, వాతావరణం అనుకూలించినటువంటి కారణాలతో రైలు ఆలస్యమైన ఇలాంటి సౌకర్యాలు ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి.
ఇలాంటి సమయంలో స్టేషన్ లో గంటల గంటలు ఎదురు చూడటం కూడా కష్టంగానే ఉంటుంది. బయట ఏదైనా హోటల్లో బస చేయాలంటే తడిసి మోపెడవుతుంది. అలాంటివారు IRCTC అందిస్తున్న రిటైరింగ్ రూమ్స్, డార్మిటరీ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు. చాలామందికి దీని గురించి సరైన అవగాహన ఉండదు.ఏసీ, నాన్ ఏసీ, సింగిల్, డబుల్, డార్మెటరీ తరహాలో రూమ్స్ అందుబాటులో ఉంటాయి కనీసం గంట నుండి గరిష్టంగా 48 గంటల సమయం వరకు గతి బుక్ చేసుకునేందుకు వీలుంటుంది ఇక ప్రాంతాన్ని బట్టి రూమ్ బుకింగ్ ఛార్జీలు మారుతూ ఉంటాయి. కనిష్టంగా ₹100 ,గరిష్టంగా ₹700 వరకు ఉంటుంది.వీటిని ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు.
ఆన్ లైన్ లో అయితే తొలత IRCTC అఫీషియల్ వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వాలి. అక్కడ మై బుకింగ్ మీద క్లిక్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే రిటైరింగ్ రూమ్ ఆప్షన్ కనిపిస్తుంది.దానిపై క్లిక్ చేస్తే మీ పిఎన్ఆర్ నెంబర్ మీరు స్టే చేయాలనుకునే స్టేషన్ వివరాలు సమర్పించాలి. చెక్ ఇన్, చెక్ అవుట్ డేట్, బెడ్ టైపు వంటి వివరాలు ఫిల్ చేయాలి. స్లాట్ డ్యూరేషన్, ఐడి కార్డ్ వంటి వివరాలు సరిగ్గా చూసుకొని పేమెంట్ చేయాలి. పేమెంట్ చేస్తే మీ రూమ్ బుక్ అవుతుంది.ఏదైనా కారణాలతో 48 గంటల ముందే రూమ్ బుకింగ్ రద్దు చేసుకుంటే మాత్రం మీ రూమ్ ధర నుండి 10 శాతం మినహాయిస్తారు. అదే ప్రయాణం చేసే ముందు రోజు క్యాన్సిల్ చేస్తే 50% మినహాయిస్తారు. ఆ తర్వాత రూమ్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ రాదు.
Also Read:రైల్వే బ్రిడ్జీని ఎందుకు స్టీల్ తో చేస్తారు..? కాంక్రీట్ తో చెయ్యకూడదా..?