షాంపూ మనం ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు జుట్టుకు రాసుకుంటాం. కానీ షాంపూ ఎలా వచ్చింది.. ఎవరు కనిపెట్టారు. అనేది మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. షాప్ కి వెళ్ళామా.. షాంపూలు తెచ్చుకున్నామా.. జుట్టుకి రాసుకున్నామా.. అంత వరకు మాత్రమే మనకు షాంపు గురించి తెలుసు.. కానీ దాని వెనక చాలా చరిత్ర ఉంది. అది ఏంటో చూద్దాం..! నిజానికి షాంపూను పరిచయం చేసింది మాత్రం మనమే.
1700 సంవత్సరం వరకు జుట్టు శుభ్రం చేసుకోవడానికి సోప్ ని ఒక తొట్టిలో ముక్కలుగా వేసి ఆ ముక్కలు కరిగిన తర్వాత జుట్టుతో సహా అందులో ముంచి శుభ్రం చేసుకునేవారు. దీనివల్ల ముఖం మంటగా, జుట్టు ఆరక బిగుతుగా మారేది. ఈ బాధ భరించలేని పూర్వీకులు షియా వెన్న పూసుకోవడం చేసేవారు. తర్వాత కుంకుడు, కాయలను పగలగొట్టి వేడి నీళ్లలో నానబెట్టి, ఆ రసాన్ని తలకు అంటుకోవడానికి పూర్వకాలం నుంచి వాడేవారని మొదటిగా మనదేశంలోనే మొదలైందని పురాణ గాథలు చెబుతున్నాయి. అయితే ఇదే పద్ధతిని 1814లో బీహార్ కు చెందినటువంటి పాట్నా క్షురకుడు సాకే దిన్ మహమ్మద్ లండన్ లో మహమ్మద్ బాత్ అనే పేరుతో మసాజ్ గది నిర్మించారు.
ఇందులో మన భారతదేశానికి చెందినటువంటి దినుసులతో చేసిన తలంటు బాగా ప్రఖ్యాతి పొందింది. అక్కడ ఆవిరి స్నానపు గదుల్లో ఈ మిశ్రమాన్ని వాడేవారట. దీంతో అతను అక్కడ చాలా ఫేమస్ అయిపోయారు. ఆయన రాణి గారితో ప్రత్యేక ప్రశంస కూడా అందుకున్నారని చరిత్ర చెబుతోంది. ఆ కాలంలోనే అతన్ని షాంపు వైద్యుడు అని పిలిచేవారట. చంపి/చాపతే హిందీ పదం దీని అర్థం మసాజ్. అందుకే దానికి షాంపు అనే పేరు వచ్చింది. తర్వాత దాన్ని ద్రవరూపంలోకి 1900 సంవత్సరంలో జర్మన్ స్టైలిస్ట్ రాష్ తీసుకువచ్చారు. ఈ విధంగా షాంపు ఇంత ఘన చరిత్రను కలిగి ఉంది.