మాస్ మహారాజ రవితేజ హీరోగా దసరా కానుకగా విడుదలైన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా మీద రవితేజ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు అంచనాలను అందుకోలేకపోయింది. సినిమా నిడివి ఎక్కువగా ఉండడం మైనస్ గా మారింది. తర్వాత రిజల్ట్ తెలుసుకుని సినిమా టీం నిడివిని బాగా తగ్గించింది.
రవితేజ కూడా ఈ సినిమా మీద బాగా నమ్మకం పెట్టుకున్నాడు. తన కెరీర్ లో మరో మైలురాయి అవుతుందని పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు విక్రమార్కుడు తర్వాత తనకు సర్టిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమాగా ప్రకటించాడు.
దీంతో సరైన ఓపెనింగ్స్ రాలేదు.తొలి వీకెండ్ పరిస్థితి చూస్తే రవితేజ కెరీర్ లో మరో డిజాస్టర్ అవుతుందేమో అన్న భయాలు కలిగాయి.అతను డిఫరెంట్ గా ఏం ట్రై చేసినా కూడా ఫలితాలు తేడాగా వస్తున్నాయి. మాస్ మసలా సినిమాలే రవితేజకు వర్క్ అవుట్ అవుతున్నాయి అన్న వాదన వినిపిస్తుంది.ఈ సినిమాకి మరో మైనస్ బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా, విజయ్ లియో సినిమాలు కూడా ఏకకాలంలో విడుదల అవ్వడం. పోటీ లేకుండా టైగర్ నాగేశ్వరరావు సింగిల్ గా రిలీజ్ అయ్యి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేదని సినీ ప్రముఖులు అంటున్నారు.
అయితే భగవంత్ కేసరి సినిమా తర్వాత తెలుగు అభిమానులు ఎక్కువగా రవితేజ సినిమాకి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు తెలుస్తుంది.ఇప్పటివరకు సినిమా 50 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. 30 కోట్ల షేర్ కు దగ్గరగా వచ్చింది. సినిమా టాక్ తో పోలిస్తే కలెక్షన్ లు బాగానే ఉన్నాయి. ఈ సినిమాకి నాన్ ధియేట్రికల్ హక్కులు కూడా బాగానే అమ్మడంతో నిర్మాత సేఫ్ జోన్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఫుల్ రన్ పూర్తయ్యేసరికి బయ్యర్లకు కూడా లాభాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా సరే రవితేజ సినిమాకి మంచి జరగాలని తెలుగు అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read:ఒకప్పుడు ఈ 10 మంది టాప్ హీరోయిన్స్…కానీ ఇప్పుడు అవకాశాలు లేక ఫేడ్ అవుట్.?