సినీ పరిశ్రమ అంటే నీటి బుడగ లాంటిది. అది ఉన్నంత సేపే అందంగా కనిపిస్తుంది.ఈ పరిశ్రమలో నటీనటుల లైఫ్ కూడా అలాంటిదే. ఎప్పుడు ఎవరికీ లైఫ్ వస్తుందో,ఎప్పుడు ఎవరూ లైఫ్ ను కోల్పోతారో కూడా చెప్పలేం. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించి బిజీబిజీకి గడిపిన హీరోయిన్ లు అందరూ చాలా మటుకు ఇళ్ళకే పరిమితమైన సందర్భాలు చాలా ఉన్నాయి.

Video Advertisement

ఎంటర్ అయిన మొదటి సినిమాకే బ్లాక్ బస్టర్ కొట్టి తర్వాత ఫేడ్ అవుట్ అయిన వారు ఎందరో ఉన్నారు. అలా కాకుండా ఓ ఐదు నుండి పది సంవత్సరాలపాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగుంది ప్రస్తుతం ఖాళీగా ఉన్న హీరోయిన్ల లిస్టు తీసుకుంటే చాలానే ఉంది. అప్పుడు సినిమాలు చేసేందుకు ఖాళీ లేని హీరోయిన్ లు నేడు సినిమాలు లేక ఖాళీగా ఉన్నారు.ఆ లిస్టులో మొదటిగా తీసుకుంటే…

1. అనుష్క:

కమర్షియల్ చిత్రాలతో పాటు లేడీ ఓరియంటల్ చిత్రాల్లో మెప్పించిన అనుష్క బాహుబలి తర్వాత జోరు తగ్గించిందని చెప్పాలి. ప్రస్తుతం సినిమాలు చేయకుండా ఖాళీగా ఉంటున్నారు. చాలా రోజుల తర్వాత ఆమె నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తాజాగా అలరించింది.

2. సమంత:

సమంత కి స్టార్ స్టేటస్ వచ్చాక ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో తోటి నటించింది. ఎప్పుడైతే నాగచైతన్య పెళ్లి చేసుకోవడం అనంతరం విడాకులు ఇవ్వడం జరిగిందో అప్పటినుండి సమంత డౌన్ ఫాల్ మొదలైంది. ఐటెం సాంగ్ లు చేయడానికి కూడా రెడీ అయిపోయింది. అయితే ఆమె నటించిన తాజా చిత్రం  డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం ఆమె అనారోగ్యంతో సినిమాలకు విరామం ఇచ్చారు.

3. రకుల్ ప్రీత్ సింగ్:

age difference between vaisshanv tej and rakul preet singh

ఈ అమ్మడు కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగుంది. అయితే ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈమె ఆఖరిగా  కొండపోలం చిత్రంలో నటించారు. తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు.

4. కృతి శెట్టి:

krithishetty

డెబ్యూ సినిమా ఉప్పెనతోటే భారీ సక్సెస్ ను అందుకున్న  తర్వాత అడపాదడపా రెండు సక్సెస్ లు కొట్టారు. ఆ తర్వాత వరుస పెట్టి డిజాస్టర్లు రావడం మొదలయింది. ఈ ఏడాది ఆమె నటించిన కస్టడీ చిత్రం ఒక్కడే రిలీజ్ అయింది. ప్రస్తుతం తెలుగులో ఏ సినిమా చేయడం లేదు.

5. కీర్తి సురేష్:

keerthi suresh distributed gold coins to dasara team..

2023లో తెలుగులో దసరా, భోళా శంకర్ సినిమాలో నటించింది. ప్రస్తుతం తెలుగులో ఏ ఇతర ఆఫర్లు అమ్మడి చేతిలో లేవు.

6. పూజా హెగ్డే:

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ పుణ్యమా అంటూ స్టార్ హీరోయిన్ గా మారిన పూజ ప్రస్తుతం తెలుగులో ఖాళీ అయిపోయారు. గుంటూరు కారం సినిమా నుండి కూడా ఆమె తప్పుకున్నారు.

7. నభా నటేష్:

ఈ అమ్మడు కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్టు కొట్టారు. తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసిన అవి గుర్తింపు ఇవ్వలేదు. ఆఖరుగా నితిన్ సరసన మాస్ట్రో సినిమాలో నటించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు.

8. మెహరీన్:

what happened to mehreen

స్టార్ సి హీరోల సరసన నటించిన మెహరీన్ ప్రస్తుతం చిన్న హీరోల పక్కన నటించడానికి కూడా సిద్ధం అయిపోయారు. ఆఫర్ లు తగ్గడమే దీనికి కారణం.

9. అను ఇమ్మానుయేల్:

ఈ అమ్మడు అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సరసన నటించిన హిట్ మాత్రం రాలేదు. తాజాగా రావణాసుర సినిమాలో నటించిన అను తర్వాత మళ్లీ ఏ సినిమాలో కనిపించడం లేదు.

10. నిధి అగర్వాల్:

nidhi agarwal

ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా తప్ప ఆమె చేతిలో మరో సినిమా లేదు. కాకపోతే ఈ సినిమా ఎప్పటికి వస్తుందన్న విషయం పై ఇంకా క్లారిటీ లేకపోవడం గమనార్హం.

Also Read:బాహుబలి సినిమాలో కూడా ఈ గ్రాఫిక్స్ లేవు ఏమో..! అసలు ఇలాంటి సీన్ ఎలా తీశారు..?