బాహుబలి సినిమా తెలుగు సినిమా స్టాండర్డ్స్ నీ ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టింది. ఆ సినిమాలో గ్రాఫిక్స్ గాని, విఎఫ్ఎక్స్ గాని హాలీవుడ్ సినిమాలకు తీసుకోని రీతిలో ఉంటాయి. ఇప్పుడు ఏ భాషలో సినిమా వచ్చినా సరే గ్రాఫిక్స్ విషయానికొస్తే బాహుబలి సినిమా తోటే పోలుస్తారు. దర్శక ధీరుడు రాజమౌళి తన నిజం తోటి బాహుబలిని ఒక రేంజ్ కి తీసుకు పోయారు.

Video Advertisement

ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సాంకేతికత అనేది తారాస్థాయికి చేరిపోయింది. సగటుపేక్షకుడు విఎఫ్ఎక్స్ క్వాలిటీ తక్కువగా ఉంటే ఇష్టపడడం లేదు. ఆ సినిమాని తక్కువ క్వాలిటీ సినిమాగా చూస్తున్నారు. కోట్లు పెట్టి తీసే సినిమాల్లో కూడా ఒక్కొక్కసారి విఎఫ్ఎక్స్ చాలా దారుణంగా ఉంటుంది. ఈ విషయాలను హీరో గానీ దర్శక నిర్మాతలు గాని పట్టించుకోవడం లేదా అంటూ విమర్శిస్తున్నారు.

6 bahubali

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ బాగా ట్రోల్స్ కి గురి అవుతుంది. అది ఏ సినిమా అంటే ప్రముఖ తమిళ హీరో శ్రీరామ్ జంటగా నటించిన శివగంగా సినిమాలోది. శ్రీరామ్ తెలుగులో చాలా సినిమాల్లో నటించాడు తెలుగు వారందరికీ అతను సుపరిచితుడే. ఇక లక్ష్మీ రాయ్ అయితే ఐటమ్ బాంబుగా పిలుచుకుంటూ ఉంటారు.

తెలుగు సినిమాల్లో స్టార్ హీరోలు సరసన ఐటమ్ సాంగ్ చేసి పాపులర్ అయింది. అయితే వీరిద్దరూ నటించిన సినిమా నే శివగంగా. ఈ సినిమాలో ఒక ట్రైన్ సీన్ ఉంటుంది. ఆ సీన్ లో విఎఫ్ఎక్స్ ఎంత కామెడీగా ఉంటుందంటే హీరో ట్రైన్ అందుకోవడానికి పరుగు పెడుతూ ఉంటాడు అది రైల్వే స్టేషన్ లో కాదు, రైల్వే ట్రాక్ పక్కన ఒక పక్కన ట్రైన్ మూవ్ అవుతూ ఉంటుంది. అలా పరిగెత్తుకుంటూ వచ్చి రన్నింగ్ ట్రైన్ ఎక్కుతాడు.ఈ సీన్ చూసిన ఎవ్వరికైనా నవ్వు ఆగదు. నిజ జీవితంలో సాధ్యం కాని వాటిని విఎఫ్ఎక్స్ లో చేస్తారు. ఇది మరి కామెడీగా ఉండడంతో ట్రోల్స్ కి గురవుతుంది.

Also Read:ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పనున్న స్టార్ హీరో యష్…!