మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు జరిగిన ఈ ఘటన అందరిని కలచి వేసింది. ప్రమాదం లో గాయపడిన సాయి ధరమ్ తేజ్ ని మాదాపూర్లోని మెడికోవర్ ఆసుపత్రికి తరలించి మొదట ప్రథమ చికిస్స అందించారు. అనంతరం అపోలో ఆసుపత్రికి తరలించారు.
అనంతరం డాక్టర్లు ఆయన్ని స్పృహలోకి తెచ్చేనందుకు ప్రయత్నిస్తూ భుజం తట్టి లేపుతున్న దృశ్యాలు.. ఉన్న ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఆ వీడియో లో సాయి ధరమ్ తేజ్ చేయని కాస్త పైకి లేపాడు. ఈ వీడియో చుసిన ఫాన్స్ ఒకింత కుదుట పడ్డారు. కానీ ఈ వీడియోలు అలా లీక్ చేయడం పై యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ మండి పడుతున్నారు.
ఐసీయూలో ఉన్న వ్యక్తి ప్రైవసీ కి గౌరవం ఇవ్వాలని అన్నారు. ఐసీయూ లోకి కెమెరాలని ఎందుకు అనుమతిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ ప్రమాదం లో గాయ పడిన సాయి ధరమ్ తేజ్ కి ఆదివారం నాడు కాలర్ బోన్ సర్జరీ చేసారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్స్ చెప్పారు.