రాంచరణ్ హీరో గా, ప్రముఖ డైరెక్టర్ సౌత్ ఇండియా లోనే టాప్ మోస్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకులు శంకర్ వీరి కంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అంటూ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమా ప్రస్తుతం సాంకేతిక నిపుణుల ఎంపిక పనుల్లో ఉన్నటు తెలుస్తుంది.
ఈ సినిమా కి తాను మాటలను సమకూర్చబోతునన్టు ప్రముఖ డైలాగ్స్ రైటర్ సాయి మాధవ్ బుర్ర గారు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘జెంటిల్ మేన్ సినిమా చూసినప్పుడుశంకర్ గారితో ఓఫోటో దిగితే ఈజీవితానికి
చాలనుకున్నాను ..ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను ..Thanks to Sankar sir.Thanks to Dil Rajugaru.. andThanks to ourMega Power స్టార్’ అంటూ ట్వీట్ చేసారు. ఈ సినిమా అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
https://twitter.com/saimadhav_burra/status/1414826984077598721