కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ సర్కార్ సామాన్య ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకువస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఉచిత గ్యాస్ కనెక్షన్ల దగ్గర నుండి రైతు బీమా, పిఎం కిసాన్ యోజన ఇలా అనేక రకాల పథకాలు ప్రజలకు చేరువ చేస్తున్నారు. చాలామందికి కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల గురించి తెలియకపోవచ్చు.
వాటి గురించి పూర్తిగా తెలుసుకుంటే అందే ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ పొందవచ్చు. అయితే ఇదే తరహాలో మోడీ సర్కార్ గర్భిణీల కోసం అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఆ పథకం పేరే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన. ఇది కేవలం గర్భిణీల కోసం వారి సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకం.
చాలామంది గర్భిణీలు పౌష్టికార లోపంతో ఉంటున్నారు. దాన్ని అధిగమించేందుకు గర్భిణీలకు 6000 రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.దేశవ్యాప్తంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల సమస్యను దృష్టిలో ఉంచుకుని, భారత ప్రభుత్వం మాతృత్వ వందన యోజనను ప్రారంభించింది. ప్రసవానికి ముందు, తర్వాత గర్భిణులు తమ బిడ్డల సంరక్షణకు, రోగాల బారిన పడకుండా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుంది. ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన జనవరి 1, 2017న ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న గర్భిణీ స్త్రీలందరూ ఈ పథకాన్ని పొందవచ్చు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న తర్వాత గర్భిణులకు ఏక మొత్తంలో రూ.6,000 అందదు.
గర్భిణులకు ప్రభుత్వం మూడు విడతలుగా రూ.6000 అందజేస్తుంది. ఈ మొత్తం నేరుగా గర్భిని బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది.ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే గర్భిణీ స్త్రీల వయస్సు కనీసం 19 సంవత్సరాల ఉండాలి. మీరు ఈ పథకాన్ని పొందాలనుకుంటే, ఈ పథకానికి సంబంధించి అధికారిక వెబ్సైట్ https://wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojana ని సందర్శించవచ్చు. మీరు ఈ వెబ్సైట్ నుండి ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తును పూరించి సంబంధిత కార్యాలయంలో సమర్పించవచ్చు. అంగన్వాడీలో లేదా హెల్ప్‌లైన్ నంబర్ 7998799804కు కాల్ చేయడం ద్వారా మరింత సమాచారం అందుబాటులో ఉంటుంది.తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, తల్లిదండ్రుల గుర్తింపు కార్డు, పిల్లల జనన ధృవీకరణ పత్రం,బ్యాంక్ ఖాతా పాస్ బుక్ అవసరం. ఈ పథకం మీకు వర్తిస్తే మూడు విడతల్లో నిధులు వస్తాయి.
Also Read:మద్యం తాగేప్పుడు చీర్స్ ఎందుకు చెప్పుకుంటారో తెలుసా..!?