మద్యం తాగేప్పుడు చీర్స్ ఎందుకు చెప్పుకుంటారో తెలుసా..!?

మద్యం తాగేప్పుడు చీర్స్ ఎందుకు చెప్పుకుంటారో తెలుసా..!?

by Anudeep

Ads

మీకు మద్యం తాగే అలవాటుందా అయితే “చీర్స్  అనే  పదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అలవాటు లేనివారు కూడా ఎన్నో సినిమాల్లో, మందు తాగే ముందు మద్యం గ్లాసులని గాల్లోకి ఎత్తి అవతలి వాళ్ళ గ్లాసుతో తాకిస్తూ “చీర్స్” అని ఆనందంగా అరవడం చూసుంటారు.

Video Advertisement

* అసలు చీర్స్ అంటే ఏంటి..
* అది ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..

చీర్స్ అనేది ”పాత ఫ్రెంచ్ పదం చియెర్ నుంచి వచ్చింది.
చియెర్ అంటే.. “ముఖం” లేదా “తల” అని అర్థం.

18వ శతాబ్దం నాటికి, దీని అర్థం “ఆనందం” మరియు “ప్రోత్సాహాన్ని” తెలియజేసేదిగా ఉండేది.

ఈ రోజుల్లో మాత్రం “చీర్స్” ని మన చుట్టుపక్కల వారు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, వారితో తమ స్నేహం కలకాలం నిలిచిపోవాలనే కోరికని వ్యక్తపరచడానికి వాడుతున్నారు.

చాలామంది మందు పార్టీలలో గ్లాస్ పైకెత్తి చీర్స్ కొట్టకుండా.. మద్యం తాగడం మొదలు పెట్టరు. అది వాళ్లకు తెలీకుండానే మందు తాగడంలో ఒక భాగం అయిపోయింది.

ఇప్పుడు ఆ చీర్స్ చెప్పుకోడానికి గల కారణాలను చూద్దాం.

1. ఇంద్రియాలను ఉత్తేజపరచడం:

స్నేహితులతో కలిసి మద్యం తీసుకునేటప్పుడు, అనేక ఇంద్రియాలు పాల్గొంటాయి. చూడడం, అనుభూతి చెందడం, రుచి, ఇంకా వాసన చూడటం.. తాగే సమయంలో గ్లాసులని ఒకదానికొకటి తాకించి శబ్ధం చేయడం ద్వారా ఆ ధ్వని తరంగాలు మన ఇంద్రియాలన్నిటిని ఒకేసారి ఉత్తేజితం చేసి ఆ అనుభవాన్ని ఎక్కువగా ఆస్వాదించడానికి దోహదపడతాయి అని నమ్ముతారు.

2. దుష్టశక్తులను పారదోలటం:
మధ్యయుగ కాలంలో, గ్లాసులతో చీర్స్ చెపుతూ చేసే శబ్దాలకి దెయ్యాలు ఇంకా దుష్టశక్తులు ఏవైనా ఉంటే ఆ శబ్దాలకు అవి పారిపోతాయి అని నమ్మేవారు.

అలాగే గ్లాసులని ఒకదానికొకటి తాకించడం ద్వారా కొంత మద్యాన్ని దుష్టశక్తులకు నైవేద్యంగా నేలపై చిందిస్తే అవి వారికి హాని చేయకుండా వెళ్లిపోతాయని కూడా భావించేవారు.

బీర్ మగ్ ని శబ్దం అయ్యేలా బలంగా టేబుల్ పై పెట్టి అరవడం ద్వారా దుష్టశక్తులు ఏవైనా ఉంటే పారిపోతాయని ఇప్పటికీ జర్మన్ ప్రజలు నమ్ముతారు.

3. విష ప్రయోగాన్ని గుర్తించడం.

ఆ రోజుల్లో శత్రువులను అంతమొదించడానికి విందుకు పిలిచి వాళ్లకు ఇచ్చే మద్యంలో విషం కలపడమనేది ఒక మార్గంగా ఎంచుకునేవారు.
అందుకే గ్లాసులను ఒకదానికొకటి కొట్టడం ద్వారా ఒకరి గ్లాసులోని మద్యం ఇంకొకరి గ్లాసులోకి చిందేలా చేసి తద్వారా విషప్రయోగం జరిగిందీ లేనిదీ గ్రహించగలిగే వాళ్ళు.

4. దేవుడికి నైవేధ్యంగా..

పురాతన కాలంలో గ్రీకులు వాళ్ళ కోరికలు తీరడానికి దేవుళ్ళకు వైన్ ని నైవేధ్యంగా ఇస్తూ వారిదైన ఒక ప్రత్యేక విధానాన్ని అనుసరించే వారు.
అంటే.. మనం గ్రామ దేవతలకు మేకలను, కోళ్లను బలివ్వడం లాంటిదన్నమాట..

ఎవరైనా చనిపోయిన తరువాత మద్య పానీయాలతో దేవుళ్ళకు నైవేధ్యంగా పెట్టి చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని గ్రీకులు, రోమన్లు దేవుడిని ప్రార్థించే వారు.

అలాగే.. తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో ఎవరైనా చనిపోయినప్పుడు వారి దగ్గరి బంధువులు ఆ కుటుంబ సభ్యులకు మద్యంతో చిన్న వేడుక లాగా  చేస్తూ వారి బాధను మరిపించే ప్రయత్నం చేయడం మనం చూస్తూనే వుంటాం.

ఇదండీ చీర్స్ వెనక కథ..


End of Article

You may also like