సీతారామం సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మృణాల్ ఠాకూర్ . రావడం రావడం తోనే మొదటి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుని తన నటనతో తెలుగు వారందరికీ దగ్గర అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. సీతారామం సినిమాలో ఆమె అందాన్ని చూసిన ప్రతి ఒక్కరూ మనసులో నింపేసుకున్నారు. సినిమాలో ఆమె నటనకి అయితే వంక పెట్టలేమనుకోండి.
ఇక సినిమాలో క్యారెక్టర్ తగ్గట్టు ట్రెడిషనల్ గా కనిపించే ఈ బ్యూటీ బయట మాత్రం అల్ట్రా మోడ్రన్ గా ఉంటుంది. అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు ఎంతలా వైరల్ అవుతాయో తెలిసిందే కదా.
తన పాత్రను క్షణాల్లో అర్థం చేసుకుని అందులోకి పరకాయ ప్రవేశం చేయడం మృణాల్ సొంతం.
అటు తెలుగు ఇటు హిందీ వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది. తాజాగా తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తుంది. ఒకటి నాని హీరోగా వస్తున్న హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న విడుదల కాబతుండగా, మరో సినిమా విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ లో నటిస్తుంది.హాయ్ నాన్న సినిమా ప్రమోషన్ లో భాగంగా నాని మృణాల్ కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా నాని తన హీరోయిన్ కి మంచి కితాబు ఇచ్చారు. తను కెమెరా కోసమే ప్రత్యేకంగా తయారు చేయబడిన ఎక్స్ట్ ఫ్యాక్టర్ అంటూ పొగిడారు.
ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ ని తన ఏజ్ ఎంత అని అడిగితే 31 అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఇప్పటివరకు మృణాల్ నీ చిన్నపిల్లగా చూస్తున్న అందరూ కూడా తన వయసు తెలుసుకొని ఇంత పెద్ద అమ్మాయా అంటున్నారు.అయితే మృణాల్ హీరోయిన్ గా రాకముందు కొంతకాలం డెంటల్ డాక్టర్ గా పని చేసిందని చెప్పింది. అలాగే తన హైట్ 5.7 అంటు క్లారిటీ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో పలు సరదా విషయాలను మృణాల్ పంచుకుంది. మృణాల్ స్పీడ్ చూస్తుంటే తెలుగులో బిజీ హీరోయిన్ గా మారడం పక్క అనిపిస్తుంది.
Also Read:నిత్య మీనన్ నటించిన “మాస్టర్ పీస్” చూశారా..? ఎలా ఉందంటే..?