నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా దసరా రేసులో ఉంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా భారీ అంచనాల నడుమ అక్టోబర్ 19న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్లు, పాటలు సినిమా పైన అంచనాలను పెంచేసాయి.
బాలకృష్ణ ఇప్పటివరకు చెయ్యని రోల్ ఈ సినిమాలో చేసినట్లుగా డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు. ఈ సినిమా ద్వారా కొత్త అనిల్ రావిపూడి ని చూస్తారని ధీమా వ్యక్తం చేశారు.హీరోయిన్ కాజల్ ఈ సినిమా ద్వారా తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుంది. క్రేజీ హీరోయిన్ శ్రీ లీల కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది.తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. 163 నిమిషాల రన్ టైం తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. సినిమాలో ఎమోషనల్ సీన్స్ ఒక్కటి కూడా కట్ చేయలేదని తెలిపారు. సినిమా చూసిన తాము కూడా ఎమోషనల్ గా ఫీల్ అయినట్లు చిత్ర యూనిట్ కి తెలియజేశారు.సెన్సార్ సభ్యులు రివ్యూ చూసి సినిమా టీం ఫుల్ జోష్ లో ఉంది.
బాలయ్య అభిమానులు కూడా ఈ పండక్కి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం ఖాయమని సంబరాలు చేసుకుంటున్నారు.సెన్సార్ సభ్యులు రివ్యూ చూసి సినిమా టీం ఫుల్ జోష్ లో ఉంది. బాలయ్య అభిమానులు కూడా ఈ పండక్కి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం ఖాయమని సంబరాలు చేసుకుంటున్నారు. అఖండ, వీరసింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ హిట్ బాలయ్య ఖాతాలో పడినట్టే అని సినిమా ఇండస్ట్రీ జనం చెబుతున్నారు.
Also Read :“ఎంత పని చేశావయ్యా..?” అంటూ… “ఉదయనిధి స్టాలిన్” పై కామెంట్స్..! విషయం ఏంటంటే..?