“ఎంత పని చేశావయ్యా..?” అంటూ… “ఉదయనిధి స్టాలిన్” పై కామెంట్స్..! విషయం ఏంటంటే..?

“ఎంత పని చేశావయ్యా..?” అంటూ… “ఉదయనిధి స్టాలిన్” పై కామెంట్స్..! విషయం ఏంటంటే..?

by Mounika Singaluri

Ads

దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న లియో మూవీ పైన అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అక్టోబర్ 19న దసరా కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.

Video Advertisement

లోకేష్ కనగరాజ్ గత చిత్రాలు ఖైదీ, విక్రమ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలకి లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ కి లింక్ ఉన్న సంగతి తెలిసిందే.

అయితే లియో మూవీకి ఎల్.సి.యు కి లింక్ ఉన్న సంగతి డైరెక్టర్ గాని సినిమా యూనిట్ గాని ఎక్కడ రివీల్ చేయలేదు. ఆడియన్స్ కూడా ఎంతో ఉత్కంఠ గా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు తమిళనాట హీరో అయిన ఉదయనిధి స్టాలిన్ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. యాక్టర్ విజయ్ లియో మూవీ చూసిన ఆయన ఎక్సైట్ మెంట్ తో ట్విట్టర్ లో ఒక పోస్ట్ వేశారు.

“యాక్టర్ విజయ్ అన్న లియో మూవీ అద్భుతంగా ఉంది అని, డైరెక్టర్ లోకేష్ ఫిలిం మేకింగ్ ఎక్సలెంట్ అని, అనిరుద్ మ్యూజిక్, అనబరివ్ మాస్టర్ స్టంట్ లు, సెవెన్ స్క్రీన్ స్టూడియో ప్రొడక్షన్” అందరికీ హర్టి కంగ్రాట్యులేషన్స్ తెలుపుతున్నట్లు ఎమోజీలు పెట్టారు. అయితే ఈ ట్వీట్ లో అసలైన ట్విస్ట్ ఇక్కడే మెన్షన్ చేశారు. హాష్ టాగ్ ఎల్.సి.యు అని పెట్టి ఆల్ ది బెస్ట్ అని పోస్ట్ వేసారు.

దీంతో ప్రేక్షకుల ఉదయినిధి స్టాలిన్ వేసిన ట్వీట్ వల్ల లియో మూవీ కూడా లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్ లో భాగమేనని తెలిసిపోయింది. ఉత్కంఠకు తెరపడింది. ప్రేక్షకులను త్రిల్ చేయాలని ఎక్కడా కూడా ట్విస్టును బయట పెట్టకుండా దాచిన సినిమా టీం కష్టాన్ని ఉదయనిది స్టాలిన్ వృధా చేశారు అంటూ నెటిజన్లు ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు.

Also Read: “ఓంకార్” దర్శకత్వంలో మరొక కొత్త కాన్సెప్ట్..! ఎలా ఉందంటే..


End of Article

You may also like