బాలీవుడ్ మన్మధుడు షారుఖ్ ఖాన్ స్క్రీన్ మీదకి వస్తే అమ్మాయిల రెప్పలార్పకుండా చూస్తారు. ఏజ్ పెరుగుతున్నా కొద్దీ యూత్ లాగా తయారు అవుతున్న షారుఖ్ ఖాన్ ను చూసి నోరెళ్ళబోసుకుంటున్నారు యువత.
అప్పట్లో మంచి లవర్ బాయ్ గా, సూపర్ హిట్ లవ్లీ సినిమాలను అందించి… ఇప్పుడు సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ తో వేడెక్కించి సినీ పరిశ్రమను షేక్ ఆడిస్తున్నాడు. కమ్ బ్యాక్ తర్వాత వరుస సినిమాలతో పరుగులు తీస్తున్నారు.
ఇక ఇటీవల జవాన్ సినిమా చిత్రీకరిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ సినిమాలోని ఓ పాటను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకి అట్లీ దర్శకత్వం వహించగా నయనతార, ప్రియమణి, దీపికా పదుకొణె వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలోని జవాన్ టైటిల్ సాంగ్ జిందా బందా అని హిందీలో, దుమ్ము దులిపేలా అని తెలుగులో విడుదల చేయగా… ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
కానీ ఈ పాటలో ప్రత్యేకత ఏంటంటే… దీనికోసం ఒకటి కాదు రెండు కాదు చాలా ప్రాంతాల నుండి అమ్మాయిలను తీసుకొచ్చారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి తదితర ప్రాంతాల నుండి మహిళా డ్యాన్సర్లను తీసుకొచ్చి షూటింగ్ చేశారు.
ఇదిలా ఉంటే ఇంకాస్త అట్రాక్షన్ జోడించడానికి ఈ పాటలో సన్యా మల్హోత్రా, ప్రియమణిలతో షారుక్ ఖాన్ వేసిన స్టెప్పులు అదరగొట్టారు. దీనికి తోడు షారుఖ్ ఈ పాటలో చాలా యంగ్ గా కనిపించడంతో అందరూ ఫిదా అయిపోతున్నారు.
ఇక ఈ పాటను 5 రోజుల్లో పూర్తి చెయ్యగా… మొత్తం 15 కోట్ల రూపాయల ఖర్చు అయ్యిందట. కాగా ఈ పాటకు అనిరుధ్ మ్యూజిక్ ఒక లెవెల్ లో ఉంటే, షారుఖ్ లుక్ మరో లెవెల్ అనే చెప్పాలి. మరి ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 7నా ఘనంగా విడుదల అయ్యే ఈ సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.