పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ సినిమాతో తో తెలుగు ప్రేక్షకులకి..అత్యంత చేరువైన నటి ‘శృతి హాసన్’ చాల కాలం క్రిందటే వెండి తెరకు పరిచయం అయినా.. సరైన హిట్ రాలేదు..గబ్బర్ సింగ్ తరువాత,’శ్రీమంతుడు’ తో మరో హిట్ సాధించిన కూడా కొన్ని రోజులు తెలుగు ప్రేక్షకులకి దూరం అయ్యారు..మరో సారి..పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘వకీల్ సాబ్’ లో నటిస్తున్నారు అంటూ..కొన్ని రూమర్స్ వినిపించాయి.
తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఫాన్స్ తో ముచ్చటించిన శృతి హాసన్ ఒక ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘నేను ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పను’ అంటూ తెలివిగా దాటివేశారు.ఆలాగే పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా చెప్పమంటూ అడిగిన ఒక ప్రశ్నకి సమాధానంగా ‘ఆయన ఓ అద్భుతం మంచి మనసున్న మనిషి’ అంటూ సమాధానం ఇచ్చారు..తాను ప్రేమలో ఉన్నట్టు ఈ మధ్య చాల వార్తలే వచ్చినప్పటికీ అలాంటిది ఏమి లేదు..అంటూ సమాధానము ఇచ్చారు..రవి తేజ హీరోగా..గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ‘క్రాక్’ సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు శృతి హాసన్.పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ సినిమా తరువాత మరే తెలుగు సినిమాలలో కనిపించలేదు.