కన్నడలో శివరాజ్ కుమార్ కి మంచి క్రేజ్ ఉంది. శివన్న అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. అయితే శివరాజ్ కుమార్ తెలుగులో కూడా అందరికీ సుపరిచితుడే. తాజాగా ఆయన రజనీకాంత్ జైలర్ సినిమాలో గెస్ట్ అపీరియన్స్ లో కనిపించి ఆడియన్స్ ను ఆలరించారు. శివన్న నటించిన ప్రతి చిత్రం తెలుగులో డబ్బింగ్ అవుతూ ఉంటుంది. తాజాగా ఆయన నటించిన ఘోస్ట్ చిత్రం జీ 5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉంది…? ఆడియన్స్ ను మెప్పించిందా లేదా…? పూర్తి రివ్యూ చూద్దాం…!
వామన్ శ్రీనివాసన్ (ప్రశాంత్ నారాయణ్)ఒక మాజీ సిఐడి అధికారి. పదేళ్లు పోరాటం చేసి కర్ణాటకలో ఉన్న సెంట్రల్ జైలు ప్రైవేటీకరణకు అనుమతులు సాధించుకుంటాడు. ఈ క్రమంలో భూమి పూజ చేసేందుకు జైల్లో అడుగు పెట్టిన అతని బృందాన్ని ఒక ముఠా కిడ్నాప్ చేస్తుంది. వాళ్లను అదే జైల్లో ఒక టవర్ లో బంధించేస్తారు. ఈ కేసును పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారి చరణ్ రాజ్ (జయరామ్) ను నియమిస్తుంది.
అతను తన పరిశోధనలో ఆ బృందాన్ని కిడ్నాప్ చేసింది పదేళ్లు క్రితం చనిపోయిన బిగ్ డాడీ (శివరాజ్ కుమార్) అని తెలుసుకుంటాడు. అసలు ఇంతకీ బిగ్ డాడీ ఎవరు? అతను జైల్లో ఉండగానే వామన్ ను ఎందుకు లక్ష్యం చేసుకోవాలనుకుంటాడు? ఆ జైల్లో ఉన్న 1000 కేజీల బంగారం కధ ఏంటి? పితామహా ఏజెన్సీలో ఉన్న ఘోస్ట్ కు బిగ్ డాడీ కి సంబంధం ఏంటి? వీరిద్దరూ ఒకటేనా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి…!ఇది ఒక రొటీన్ గ్యాంగ్స్టర్ డ్రామా…! ఎలివేషన్ లు, మాస్ ఎలిమెంట్స్ ను నమ్ముకుని చేసిన సినిమా కాకపోతే లాస్ట్ లో స్పై టచ్ ఇచ్చి ఆసక్తి రేపించారు.
ఈ సినిమా చూసినప్పుడు.Kgf,జైలర్ సినిమాలో చూసిన మాస్ ఎలివేషన్ లు గుర్తువస్తాయి.కట్టుదిట్టమైన భద్రత ఉన్న జైల్ లో ఒక మాజీ సిఐడి అధికారిని హీరో కిడ్నాప్ చేసి పోలీస్ వ్యవస్థను ముప్పు తిప్పలు పెట్టడం ఈ చిత్ర కథాంశం.ఇలాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే చాలా ముఖ్యం.అది ఫస్ట్ హాఫ్ లో మాత్రమే వర్క్ అవుట్ అయింది.ఈ సినిమా ఆసక్తికరంగ మొదలయిన కూడా తర్వాత జైల్ లోనే తిరుగుతూ బోర్ కొడుతుంది.చరణ్ రాజ్ వేసే ఎత్తులు,బిగ్ డాడీ వాటిని చిత్తు చేసే తీరు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మధ్యలో వచ్చే హీరోయిన్ ట్రాక్ చిరాకు పెట్టిస్తుంది.
సెకండ్ హాఫ్ మొత్తం బిడ్ డాడీ గతం,అతని లక్ష్యం చుట్టూ తిరుగుతూ కిక్ సినిమా క్లైమాక్స్ ను గుర్తు చేస్తుంది.సినిమా ముగింపు సంతృప్తి ఇవ్వదు..రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో శివ రాజ్ కుమార్ బాగా నటించారు.కళ్లతోనే హావభావాలు పలికించారు. ఆయన స్టార్ డమ్ కి తగ్గట్టు దర్శకుడు రూపొందించిన మాస్ సీన్లు బాగున్నాయి.చరణ్ రాజ్ పాత్రలో జయరామ్ మంచి నటన కనబరిచారు.హీరోయిన్ పాత్ర స్పీడ్ బ్రేకర్ లా ఉంది.మిగతా నటులు తమ పరిధి మేరకు నటించారు.
దర్శకుడు కథలో కొత్తదనం ఉన్న దాని స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడం లో తడబడ్డాడు.మాస్ సీన్స్ బాగా రాసుకున్నారు.అర్జున్ జన్య సంగీతం బాగుంది. కెమెరా వర్క్ కూడా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి.ఫైనల్ గా శివరాజ్ కుమార్ ని మాస్ యాక్షన్ సీన్స్ లో చూడాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఆప్షన్ గా ఉంటుంది. కామన్ ఆడియన్స్ అయితే ఒకసారి చూడవచ్చు.
Also Read:దాదాపు 5 సంవత్సరాల ముందు తీశారు… ఇప్పుడు రిలీజ్ అయ్యే ముందు రోజు ఆపేసారు..! ఈ సినిమాకి ఏమయ్యింది..?