రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు మారు పేరు అయన సినిమా తీసినా, ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా, ఒక ట్వీట్ వేసినా, సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఆ మేటర్ గురించే మాట్లాడుకుంటారు. ఆ మధ్య పవన్ ఫాన్స్ తో ట్విట్టర్ వార్ చేసిన వర్మ. ఈ మధ్య లాక్ డౌన్ లో పలు సినిమా లు కూడా తీశారు, అవి పెద్దగా జనాలకి ఎక్కలేదనుకోండి అది వేరే విషయం. ఎన్ని సినిమాలు సక్సెస్ కాకపోయినా ఇంకా సినీ అభిమానులు ఆర్జీవీ సినిమా కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. అది ఆయన ఫాలోయింగ్.
ఇటీవలే బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీ తో జిం చేస్తూ ఫోటోలు దిగిన ఆర్జీవీ త్వరలో వర్కౌట్ వీడియో పోస్ట్ చేస్తా అంటూ చెప్పారు కూడా. ఒక్క ఇంటర్వ్యూ ద్వారా అరియనా యాంకర్ నుంచి సెలెబ్రెటీ స్థాయికి వెళ్లారు ఆమె. మరో సినిమా హీరోయిన్ అప్సర రాణి కూడా ఒక్క సినిమా తో ఫేమస్ అయ్యారు. ఇక ఆర్జీవీ మరో హీరోయిన్ ని పరిచయం చేసే పనిలో ఉన్నారు కాబోలు మరో పోస్ట్ తో సంచలనం సృష్టించారు ఆర్జీవీ. ఇంస్టాగ్రామ్ లో ఆర్జీవీ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. సినీ అభిమానులు కూడా ఆతృతగా ఎవరా హీరోయిన్ అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే. ‘ ఈ పోస్ట్ లో నేను ఇంకా సోనియా నరేష్, ఈ పోస్ట్ ని నాయన గంగూలీ తీశారు. నువ్ కూడా టాలెంటడ్ యాక్ట్రెస్ వే. ఫోటోగ్రఫీ లో అంటూ చమక్కులు పేల్చారు ఆర్జీవీ.
Sonia Naresh Instagram Images
Heroine Sonia Naresh Pics
Heroine Sonia Naresh Pics
also Read : ACTRESS APSARARANI IMAGES, AGE, PHOTOS, FAMILY, BIOGRAPHY, MOVIES LIST
https://www.instagram.com/p/CPux2gUlJyx/
Images Credits : Sonia_Naresh Instagram