కోవిడ్-19 కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే..మే3 తేదీ నుంచి తిరిగి మే 17 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగించిన కేంద్ర హోమ్ శాఖ…గ్రీన్ జోన్స్, ఆరెంజ్ జోన్స్, రెడ్ జోన్స్ గా విధించి కొన్ని వెసులుబాటులని కల్పించింది..అయితే రైలు ప్రయాణం కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులకు మరో సారి నిరాశే ఎదురయింది…మే 3 తరువాత స్వస్థలాలకు వెళ్లాలని భావించిన ప్రయణికుల కి మొండి చెయ్యి చూపెట్టింది.రైళ్లు ,సబర్బన్ రైళ్ల రద్దు ని మే 17 వరకు కొనసాగించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది కరోనా వైరస్ నివారించే భాగంగా లాక్ డౌన్ ను మరిన్ని రోజులు పొడిగించడం తో రైల్వే శాఖ ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. పార్సిల్ , సరకు రవాణా కి ఎటువంటి ఆటకం ఉండదు అంటూ ప్రకటించింది. రైలు టిక్కెట్ల కోసం స్టేషన్లకు రావొద్దు అంటున్నారు. లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చికుక్కున విద్యార్థులు,పర్యాటకులు,వలస కార్మికులు,తీర్థయాత్రికులు, మరే ఇతర కారణాల చేత చిక్కుకున్న ప్రయాణికులు శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా తమ స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేయబోతునన్టు వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం మేరకు ,కేంద్ర హోమ్ శాఖ మార్గ దర్శకాలనులోబడి శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడుపబోతుననట్టుగా తెలిపింది.ఈ రైళ్లలో ప్రయాణదలచిన వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించవల్సిందిగా సూచించారు.రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి నమోదు చేసుకున్న వారికి మాత్రమే ప్రయాణించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ప్రకటించింది వ్యక్తులకి టిక్కెట్లను విడివిడిగా ఇవ్వడం కుదరదు బృందాలకు కూడా టికెట్లు ఇవ్వడం సాధ్యపడదు కాబట్టి టిక్కెట్ల కోసం నేరుగా రైల్వే స్టేషన్లకు దయచేసి రావద్దు అని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేస్తున్నారు.
Tag: