సోషల్ మీడియాలో ప్రముఖ సినిమాల్లో సీన్స్ రీల్స్ చేసి ట్రెండింగ్ చేయడం బాగా ఫేమస్ అయింది. ప్రతి సినిమాల్లోనూ ఏదో ఒక ఫేమస్ డైలాగో లేక ఫేమస్ సాంగ్ తీసుకుని రీల్స్ చేస్తూ ఉంటారు. చాలామంది సినిమాలో కంటే బాగా చేశారని అనిపిస్తారు. చాలామంది చేసేవి కామెడీ అయిపోతుంటాయి.
అయితే తాజాగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీ టైటిల్ టీజర్ రిలీజ్ అయి అందులో ఒక డైలాగ్ బాగా ఫేమస్ అయింది. మధ్యతరగతి వారైతే కలలు కనలేమా ఏంటి అంటూ ఉండే డైలాగులో చివరగా ఐరనే వంచాలా ఏంటి అని ముగుస్తుంది.
ఈ చిత్రంలోని ఈ డైలాగ్ ఇటీవల ట్రెండింగ్ లో నిలిచింది. ఐరనే వంచాలా ఏంటి అంటూ ప్రతి ఒక్కరూ రీల్స్ చేయడం మొదలుపెట్టారు.ఇప్పుడు ఈ సినిమాలో రీల్ కి స్కూఫ్ గాముగ్గురు అమ్మాయిలు ఒక వీడియో చేసి వదిలారు.బక్కగా ఉంటే ఏం చేయలేమా, గాలేస్తే ఎగిరిపోతామంటూ డైలాగ్ చెప్పి చివరిగా ఐర నే వంచాలా ఏంటి అంటూ ఆ అమ్మాయి డైలాగ్ చెపుతుంది. అయితే సినిమాలో విజయ్ దేవరకొండ నిజంగా ఐరన్ వంచి చూపిస్తాడు.
ఇక్కడ ఈ అమ్మాయి పాపం ఐరన్ రాడ్ తీసుకుని ఉంచడానికి ప్రయత్నించి వంచలేక కామెడీ అయిపోతుంది. ఈ వీడియో చూసిన వారందరూ పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుతున్నారు.ఇక అసలు విషయానికి వస్తే ఫ్యామిలీ స్టార్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. పరశురాం పెట్ల డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుందని టాక్. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా రీల్స్ చేయడం విజయ్ దేవరకొండ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని మూవీ టీం కూడా వీటిని ఎంకరేజ్ చేస్తుంది.
Watch video:
No offence but@TheAlexDunphy_ and copic.twitter.com/Qe7tTA8vtr
— Sun-K🌶️ (@zunkkkkkk) November 5, 2023
Also Read:ఓటిటి లోకి “త్రిష” సినిమా…ఎందులో చూడాలంటే.? ఇంతకీ ఈ సినిమాలో ఏముంది.?