ఓటిటి లోకి “త్రిష” సినిమా…ఎందులో చూడాలంటే.? ఇంతకీ ఈ సినిమాలో ఏముంది.?

ఓటిటి లోకి “త్రిష” సినిమా…ఎందులో చూడాలంటే.? ఇంతకీ ఈ సినిమాలో ఏముంది.?

by Mounika Singaluri

Ads

త్రిష ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. తన అభినయానికి సపరేట్ ఫాన్స్ కూడా ఉన్నారు. త్రిష ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 20 సంవత్సరాల పూర్తవుతున్న కూడా తన చెక్కుచెదరని అందంతో ఇప్పటికీ అభిమానులను అలరిస్తూ ఉంటారు. తాజాగా లియో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ది రోడ్ అనే చిత్రంలో కూడా నటించింది. త్రిష ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాను అరుణ్ వశీగరన్ డైరెక్ట్ చేశాడు.

Video Advertisement

అక్టోబర్ 18 విడుదలైన ది రోడ్ సినిమా ధియేటర్ లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా విడుదలైన నెల రోజులకే ఓటిటిలోకి అడుగుపెట్టబోతుంది. యదార్థ సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిష డేరింగ్ అండ్ డాషింగ్ గా కనిపించింది.

తమిళనాడులోని జాతీయ హైవేలో పై జరిగిన కొన్ని యధార్థ ఘటనలు ఈ చిత్రంలో చూపించారు జాతీయ హైవేలోని ఒక ప్రదేశంలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఫేక్ యాక్సిడెంట్ లకు పాల్పడుతూ ప్రజలను దోచుకుంటున్న ఓ ముఠా గుట్టును రట్టు చేసే పాత్ర కనిపించింది. ఇలాంటి రోడ్డు ప్రమాదంలోనే మరణించిన తన భర్త కొడుకు మరణాలపై ఏవిధంగా ప్రతీకారం తీర్చుకుంటుంది అనే పాయింట్ తో ఈ చిత్రం తెరకెక్కించారు. కథ చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ, అద్భుతమైన స్క్రీన్ ప్లే తో కొత్తగా ప్రజెంట్ చేశారు. ది రోడ్ చిత్రంలో త్రిష తో పాటు షబ్బీర్, సంతోష్ ప్రతాప్, మియా జార్జ్, ఎంఎస్ భాస్కర్ కీలకపాత్రలో కనిపించారు.

అలాగే వివేక్ ప్రసన్న, వేల రామమూర్తి, ఎంఎస్ భాస్కర్, గణేష్ గోపీనాథ్ లక్ష్మీ ప్రియ, సాత్విత్ లు కూడా ఈ సినిమాలో నటించారు. సామ్ సిఎస్ సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా ఈ చిత్రం హక్కులను దక్కించుకుంది. ఈ క్రమంలో నవంబర్ 6వ తేదీ నుండి ఈ చిత్రం ఓటిటి లో స్ట్రీమ్ అవ్వబోతుంది. ముందుగా ఈ చిత్రంను తమిళ ఓటిటి లో విడుదల చేస్తారు. ఆ తర్వాత వివిధ భాషల్లో ఓటిటి లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

 

Also Read:ఈ వీడియోలో డాన్స్ చేస్తున్న ప్రముఖ హీరోయిన్ ఎవరో తెలుసా..? ఇప్పటికి కూడా అదే అందం..!


End of Article

You may also like