యష్ రాజ్ సినిమాస్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన చిత్రమే టైగర్-3. సల్మాన్ ఖాన్,కత్రినా కైఫ్ జంటగా ఇది వరకు వచ్చిన ఏక థా టైగర్,టైగర్ జిందా హై సినిమాలకు కొనసాగింపుగా టైగర్-3 రూపొందింది. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో వార్, పఠాన్ సినిమా హీరోలు షారుక్ హృతిక్ రోషన్ ల అతిధి పాత్రలు ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం…!
విద్వేషపు ఆలోచనల్లో ఉన్న మాజీ ఐఎస్ఐ ఏజెంట్ అతీష్ రెహ్మాన్ (ఇమ్రాన్ హష్మి) పాకిస్తాన్ ప్రధానమంత్రి నశ్రీన్ ఇరానీ ని (సిమ్రాన్ )హత్య చేసి ఆ నేరాన్ని ఇండియా ఏజెంట్ టైగర్ (సల్మాన్ ఖాన్) పై వేయాలని పన్నాగం పన్నుతాడు. ఆమె చేస్తున్న శాంతి ప్రయత్నాలు నచ్చని అతీష్ పాకిస్తాన్ దేశ సైన్యాధికారులను రెచ్చగొట్టి మరీ ఇందుకోసం వ్యూహ రచన చేస్తాడు.
టైగర్ అతని భార్య జోయ (కత్రినా కైఫ్) వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి వారి బిడ్డ జూనియర్ ని అడ్డం పెట్టుకుని ఇద్దరిని ఇస్తాంబుల్ లో ఓ ఆపరేషన్ లో వాడుకుంటాడు. ఆ ఆపరేషన్ తోనే టైగర్ ని, జోయా ని దేశద్రోహులుగా ప్రపంచం ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. మరి అతీష్ అనుకున్నది నెరవేరిందా? అతని విద్వేషపు ప్రయత్నాలను టైగర్ ఎలా తిప్పుకొట్టాడు? అనేది తెరపై చూడాలి.
ఇదివరకు ఈ యూనివర్స్ లో భాగంగా వచ్చిన సినిమాలాగే దేశభక్తి ప్రధానంగా సాగే యాక్షన్ కథ ఇది. రహస్య ఆపరేషన్ లో ఉన్న రా ఏజెంట్ టైగర్ విన్యాసాలతో కథ మొదలవుతుంది. ఏజెంట్ డ్రామా గానే కాకుండా టైగర్ కుటుంబం, పగా ప్రతీకారం నేపథ్యాన్ని కూడా మేలావించడమే ఈసారి కథలో ప్రత్యేకత. తొలి రెండు సినిమాల్లో జోడిగా నటించిన టైగర్, జొయా ఇందులో బిడ్డకు తల్లిదండ్రులుగా కనిపిస్తారు.
ఇదివరక చిత్రాలు కంటే భారీ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ గాని కథ,మనసుల్ని తాకని భావోద్వేగాలు, కొత్తదనం లేని యాక్షన్ ఘట్టాలతో సినిమా పెద్దగా మెప్పించదు. కథనం కూడా ప్రేక్షకులు ఊహించే విధంగా ఉంది. సల్మాన్ ఖాన్, కత్రినా జోడి చేసే యాక్షన్ భారీ హంగులు మినహా చెప్పుకోదగ్గ అంశాలు అనేది లేవు.
సల్మాన్ అభిమానులను అలరించే విషయాలు కూడా పెద్దగా లేవు. కాస్తలో కాస్త ఇస్తాంబుల్ లో టైగర్, అతని బృందం కలిసి చేసే ఆపరేషన్ ఆకట్టుకుంటుంది.టైగర్ తో పఠాన్ కలిసి చేసే విన్యాలు సినిమాకి హైలైట్. ముఖ్యంగా పోరాటాల్లో షారుక్ చేసిన అల్లరి ఇద్దరి మధ్య మాటలు అలరిస్తాయి. పతాక సన్నివేశాలు మెప్పిస్తాయి. పాకిస్తాన్ లో నిత్యం చోటుచేసుకునే అంతర్గత రాజకీయ వ్యవహారాలను పోలి ఉంటాయి ఈ సన్నివేశాలు.
దేశ అధ్యక్షురాలు టైగర్ కి బహుమానంగా జాతీయగీతం వినిపించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చివరిలో అతిధి పాత్రలో హృతిక్ రోషన్ మెరుస్తాడు. ఈ యూనివర్స్ చిత్రంలో భాగంగా వచ్చే వార్ 2 కోసమే ఆ సన్నివేశాలు. ఈ చిత్రంలో హృతిక్ ను ఢీకొట్టే పాత్రలో ఎన్టీఆర్ నటించనున్న సంగతి తెలిసిందే.సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ కలిసి చేసే యాక్షన్ హంగామా ఈ సినిమాకి బలం. వారిద్దరూ మరోసారి అలరించారు. కణం కణం పాటలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. కత్రినా కైఫ్ టవల్ కట్టుకుని చేసిన పోరాటం ఆకట్టుకుంది. ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా బాగా నటించాడు.
సిమ్రాన్ పాకిస్తాన్ ప్రధానిగా మంచి నటన కనబరిచారు. షారుక్ అతిథి పాత్ర సినిమాకి హైలైట్. ఆదిత్య చోప్రా కథ, శ్రీధర్ రాఘవన్ కథనాలు ప్రేక్షకులు అలరించలేక పోయాయి. దర్శకుడు మనిష్ శర్మ కొన్ని సన్నివేశాలపై ప్రభావం చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కెమెరా పనితనం బాగుంది ఎడిటింగ్ లోపాలు ఉన్నాయి.
Final Verdict:ఫైనల్ గా సల్మాన్ ఖాన్ కోసం టైగర్-3 ని ఒకసారి చూడవచ్చు.
Also Read:5 కోట్లు పెట్టి తీసిన సినిమా… 50 కోట్లు తెచ్చిపెట్టింది..! అంతలా ఏం ఉంది..?