5 కోట్లు పెట్టి తీసిన సినిమా… 50 కోట్లు తెచ్చిపెట్టింది..! అంతలా ఏం ఉంది..?

5 కోట్లు పెట్టి తీసిన సినిమా… 50 కోట్లు తెచ్చిపెట్టింది..! అంతలా ఏం ఉంది..?

by kavitha

Ads

మలయాళ చిత్రాలు కంటెంట్ బేస్డ్ చిత్రాలని చెప్పవచ్చు. సినిమాలో పేరు గాంచిన నటీనటులు లేనప్పటికీ, కథ పై ఆధారపడి తీసిన తక్కువ బడ్జెట్ చిత్రాలు అయినప్పటికి పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. వాటికి ఉదాహరణగా రోమంచమ్ సినిమాను చెప్పవచ్చు. 2 కోట్లు పెట్టి ఈ సినిమాను నిర్మిస్తే ప్రపంచవ్యాప్తంగా 69 కోట్లు వసూల్ చేసి, బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది.

Video Advertisement

ఈ చిత్రం లాగే గత ఏడాది మలయాళంలో రిలీజ్ అయిన ఒక చిన్న సినిమా కూడా 5 కోట్లు పెట్టి నిర్మించగా 50 కోట్లు వసూల్ చేసి, బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతగా ఈ చిత్రం హిట్ అవడానికి ఈ చిత్రంలో ఏముందో ఇప్పుడు చూద్దాం..
మలయాళ నటుడు మరియు నిర్మాత అయిన కుంచాకో బోబన్ నటించిన ‘నా తాన్ కేస్ కొడు’ అనే సినిమా 2022 లో ఆగస్ట్ 11న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ గాను హిట్ గా నిలిచింది. 5 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం 50 కోట్లను వసూల్ చేసింది. ఈ చిత్రం ఏనాట గా హిట్ అయ్యింది అంటే బాలీవుడ్ చిత్రాలైన అమీర్ ఖాన్, లాల్ సింగ్ చద్దా మరియు అక్షయ్ కుమార్ రక్షా బంధన్‌ చిత్రాల స్క్రీన్ కౌంట్‌ను తగ్గించి, ఆ థియేటర్‌లను ఈ చిత్రం మరిన్ని షోలను వేశారు.
ఈ చిత్ర కథ విషయానికి వస్తే చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బ్రతికే దొంగ కోజుమ్మల్ రాజీవ్ కూలీ పని చేసే తమిళ అమ్మాయి దేవిని ఇష్టపడతాడు. ఆమె కోసం దొంగతనాలు మానేసి,  కూలీగా మారుతాడు. ఆమె ఇంట్లో కలిసి ఉండాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఒకరోజు గుడి లో జరిగే భజనకు వెళ్లి తిరిగి వస్తుండగా వేగంగా వస్తున్న ఆటో ను నుండి తప్పించుకుందేనందుకు, పక్కనే ఉన్న ఇంటి గోడ దూకడంతో అక్కడి పెంపుడు కుక్కలు కరుస్తాయి.
వాటి అరుపులకు లేచిన ఇంట్లో వారు అతడి పై దొంగతనం ఆరోపణలు చేస్తారు. ఆ ఇల్లు ఎమ్మెల్యేది కావడంతో పోలీసులు వెనటనే అరెస్ట్ చేస్తారు. కేసు కొరత్కు వెళ్తుంది. కోర్టులో, రాజీవ్ తనకు తెలిసిన పోలీసుగా మారిన న్యాయవాది సహాయంతో తన కేసును తనే స్వయంగా వాదించి, సాక్ష్యాలను తెస్తానని వాగ్దానం చేస్తాడు. అతను సాక్ష్యాలను ఎలా సంపాదించాడు. కోర్టులో ఎలా నిర్దోషి అని నిరూపించుకున్నాడనేది మిగతా స్టోరీ.
ఈ చిత్రాన్ని దర్శకుడు రతీష్ బాలకృష్ణన్ పొదువాల్ చెప్పాలను కున్న పాయింట్ ను చక్కగా, చాలా సహజంగా తెర పై చూపించాడు. కామెడీ సన్నివేశాలు, కుంచాకో బోబన్ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది. హీరోయిన్ గా గాయత్రీ శంకర్ నటించారు. డాన్ విన్సెంట్ ఈ మూవీకి సంగీతాన్ని సమకూర్చారు

Also Read: సీనియర్ ఎన్టీఆర్ గారి పెళ్లి పత్రిక చూసారా.? వివాహం ఎక్కడ జరిగింది అంటే.?


End of Article

You may also like