అవిభక్త కవలలు అని వినగానే మనకు గుర్తొచ్చే పేర్లు వీణ-వాణి. వీరి పేర్లు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరు ఉండరు. ఈ అవిభక్త కవలలు వీణ-వాణీలు 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని 18 వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు.
వీళ్లు హైదరాబాదులోని నీలోఫర్ హాస్పిటల్ లో 2002 అక్టోబర్ 16న జన్మించారు. పుట్టిన దగ్గర నుండి 13 ఏళ్లపాటు నీలోఫర్ లోనే ఉన్నారు. సంకల్పం దైవబలం తోడుంటే ఏదైనా సరే సాధ్యం కాదు అనడానికి వీళ్లే ఒక ఉదాహరణ. ఈ అవిభక్త కవలల ఆరాటం ముందు ఆటంకం కూడా చిన్నబోయింది.
ఈ ఇద్దరు తలలు ఒకటే, తెగింపు ఒకటే, తెలివి ఒకటే. వైకల్యంతో చిన్ననాటి నుండి ఎన్నో సవాల్లు ఎదుర్కొంటున్న వీరు సంకల్ప బలంతో ముందుకు వెళ్తున్నారు. ఎవరు విడదీయలేని బంధం వీరిది. ఒకరు లేకుండా మరొకరు ఉండలేరు. ఆ ఇద్దరికీ ఇద్దరే తోడు నీడ.వీళ్లను హాస్పిటల్ నుండి వచ్చాక యూసఫ్ గూడా లో ఉన్నటువంటి స్టేట్ హోమ్ కు తరలించారు. ఈ అవిభక్త కవలలను శాస్త్ర చికిత్సతో వేరు చేయాలనే అంశం పైన ఢిల్లీ ఎయిమ్స్ వైద్య బృందం సహా మూడు వైద్య నిపుణ కమిటీలు అధ్యయనం చేశాయి.
అయితే వీరిని సపరేట్ చేస్తే ప్రాణాలకే ముప్పు ఏర్పడే అవకాశం ఉందని తేలడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.గతంలో నీలోఫర్ హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఈ చిన్నారులకు ఖర్చును ప్రభుత్వమే ముందుకు వచ్చి భరించింది.
దేశ విదేశాల్లో ఉన్నటువంటి వైద్య నిపుణులు సైతం తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ అది ఫలించకపోవడంతో ఇద్దరూ ఈనాటి వరకు అలానే ఉన్నారు. అందరిలానే తమ పుట్టినరోజు వేడుకలను ఇంట్లో జరుపుకోవాలని ఆశగా ఉన్నప్పటికీ తమకి మొదటి నుండి అలవాటైనటువంటి స్టేట్ హోమ్ లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అంటున్నారు.
Also Read:ఒక్కరోజే 6 సార్లు గుండె ఆగిపోయింది… అయినా బతికాడు..! ఎలా అంటే..?