ఒక విద్యార్థికి ఒకేరోజు ఆరు సార్లు గుండె ఆగిపోయింది. అయినా సరే అతను బతికాడు. వివరాల్లోకి వెళితే, బీబీసీ తెలుగు కథనం ప్రకారం, ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్స్ అంటే రక్తం గడ్డ కట్టడంతో అతుల్ రావు అనే ఒక వ్యక్తికి జూలై 27వ తేదీన గుండెపోటు వచ్చింది.

Video Advertisement

ఆ తర్వాత ఒక్క రోజులో అతని గుండె ఐదుసార్లు ఆగింది. అప్పుడు వైద్యులు ఆ గడ్డ కట్టిన రక్తాన్ని సాధారణంగా ప్రసరించేలా చేయడానికి మందులు ఇచ్చారు. దాంతో పరిస్థితి మళ్ళీ మామూలు అయ్యింది. అమెరికాకి చెందిన అతుల్ లండన్ లో ప్రీ మెడికల్ డిగ్రీ చదువుతున్నారు.

atul rao incident uk

ఇప్పుడు తనకి గుండెపోటు వచ్చి తగ్గిన తర్వాత తాను వైద్యరంగంలోనే తన కెరీర్ కొనసాగించాలి అని అనుకుంటున్నట్టు అతుల్ తెలిపారు. ఈ విషయంపై అతుల్ మాట్లాడుతూ, “నాకు గుండెపోటు రాకముందు ఈ మెడిసిన్ చేయాలి అనుకున్న నిర్ణయం సరైనదా? కాదా? ఇంక వేరే వృత్తి ఎంచుకుందామా? అనే ఒక ఆలోచన ఉండేది. కానీ నేను స్పృహలోకి వచ్చాక నాకు అర్థం అయ్యింది. నాకు వరంలా దొరికిన ఈ జీవితాన్ని నా సమయాన్ని ఇంకొకరి ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగించాలి అని నేను అనుకుంటున్నా” అని అన్నారు.

atul rao incident uk

అంతే కాకుండా తన ప్రాణాలని కాపాడిన వైద్యులని కూడా అతను కలిశారు. అసలు గుండెపోటు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. లండన్ లో ఉన్న హ్యామర్‌స్మిత్ ఆస్పత్రి లో అతుల్ కి వైద్యం అందించారు. ఆ తర్వాత సెయింట్ థామస్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. తన 21 పుట్టిన రోజు నాడే తనకి గుండెపోటు వచ్చింది అని చెప్పారు.

atul rao incident uk

అతుల్ తల్లి శ్రీవిద్య మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్. తండ్రి అజయ్ ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ విషయంపై శ్రీవిద్య మాట్లాడుతూ, “దీని వల్ల జీవితం పట్ల ఉన్న ఆలోచన మారింది. ఇంత చిన్న వయసులోనే అన్ని అర్థం చేసుకుంటున్నాడు. ఈ ఒక్క సంఘటన అతని జీవితాన్నే మార్చేసింది. అతని జీవితం మీద చాలా ప్రభావం చూపింది” అని అన్నారు.

ALSO READ : ఇండియన్స్ ని తిట్టినందుకు…తన సత్తా ఏంటో చాటాడు..! హ్యాట్సాఫ్ బ్రదర్..!!!