ఇండియన్స్ ని తిట్టినందుకు…తన సత్తా ఏంటో చాటాడు..! హ్యాట్సాఫ్ బ్రదర్..!!!

ఇండియన్స్ ని తిట్టినందుకు…తన సత్తా ఏంటో చాటాడు..! హ్యాట్సాఫ్ బ్రదర్..!!!

by kavitha

Ads

ఇండియాకి చెందిన నూరుల్ హాసన్ గొప్ప ఆర్టిస్ట్. కొన్ని నెలల క్రితం అమెరికాకు చెందిన ఒక ఆర్టిస్ట్ ఒకేసారి మెస్సీ మరియు డోనాల్డో ఫోటోలను డ్రా చేసి, తన యొక్క యూట్యూబ్ ఛానెల్ లో షేర్ చేశాడు. ఆ యూట్యూబ్ వీడియో క్రింద కామెంట్ సెక్షన్ లో నూరుల్ హాసన్ సార్ నేను కూడా ఇలా డ్రా చేయగలను అని కామెంట్ చేశాడు.

Video Advertisement

అయితే నూరుల్ కామెంట్ చూసిన వేరొక వ్యక్తి ‘యూ బ్లెడి ఇండియన్స్’ ఇలా చేయడం మీ వల్ల కాదు అంటూ కామెంట్ పెట్టాడు. ఇండియన్స్ తిట్టడం, తక్కువ చేసి మాట్లాడం నచ్చని నూరుల్ హాసన్ చాలా బాధ పడ్డాడు. ఆ తరువాత ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకేసారి నలుగురి ఫోటోలను (అబ్దుల్ కలాం, భగత్ సింగ్, సోను సూద్, విక్రమ్ బాత్రా) డ్రా చేసి, తన టాలెంట్ ఏమిటో చూపించాడు.
ఈ  ‘ఇండియన్ రియల్ లైఫ్ హీరోస్’ స్కెచ్ వర్క్‌ వీడియోని రియల్ హీరో సోనుసూద్ 2021లో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఒక కళాకారుడు తనను రియల్ లైఫ్ హీరోలతో కలిపి డ్రా చేసినందుకు సోనూ సూద్ గర్వంగా భావించాడు. ఈ పోస్ట్‌ను షేర్ చేస్తున్నప్పుడు,  ‘నా అవార్డు’ అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఆ తరువాత నూరుల్ హాసన్ ఒకేసారి ఐదుగురి ఫోటోలను డ్రా చేసి, వరల్డ్ రికార్డుని సృష్టించారు.
ఈ గొప్ప ఇండియన్  ఆర్టిస్ట్ ‘నూరుల్ ఆర్ట్’ పేరుతో సోషల్ మీడియా వేదికలు అయిన ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో  తాను గీసిన చిత్రాలకు సంబంధించి వీడియోలను షేర్ చేస్తుంటాడు. అంతే కాకుండా అతనికి ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఆ ఛానెల్ పేరు కూడా నూరుల్ ఆర్ట్. అతని ఛానెల్ కు వేలమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.

https://www.instagram.com/p/CWGdELghV_G/

Also Read: “యశస్వి జైస్వాల్” ని ఇంటర్వ్యూ చేసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

 


End of Article

You may also like