యశస్వి జైస్వాల్ ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. తాజాగా ఆసియా క్రీడల్లో నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో ఈ యంగ్  ఓపెనర్ సెంచరీతో వీరవిహారం చేశాడు. ఈ సెంచరీతో మల్టీ స్పోర్ట్ ఈవెంట్ టీ20లో సెంచరీ చేసిన తక్కువ వయస్కుడైన ఇండియన్ క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.

Video Advertisement

21 ఏళ్ల యువ భారత క్రికెటర్ తన ఆటతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అయితే కొద్ది రోజుల ముందు లలన్‌టాప్‌ అనే ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ  వైరల్ కాగా, జైస్వాల్ ను ఇంటర్వ్యూ చేసిన యాంకర్ ఎవరా అని నెటిజెన్లు ఆరా తీస్తున్నారు. మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఇండియన్ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ ని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ పేరు గరిమా భరద్వాజ్. ఆమె ప్రముఖ జర్నలిస్ట్ మరియు న్యూస్ యాంకర్. యశస్వి జైస్వాల్ ను ఇంటర్వ్యూ చేసిన తర్వాత గరిమా వైరల్‌గా మారింది. దాంతో ఆమె ఎవరా అని నెట్టింట్లో వెతుకుతున్నారు. ఆమె ప్రస్తుతం ‘ది లలన్‌టాప్‌’ అనే పాపులర్ షోలో పని చేస్తుంది.
ఆమె సక్సెస్ ఫుల్ స్పోర్ట్స్ జర్నలిస్ట్. అంతకు ముందు దైనిక్ జాగరణ్, పాఠక్ పత్రిక, ఇండియా న్యూస్‌లతో పాటు అనేక మీడియా సంస్థలకు పనిచేసింది. గరిమా భరద్వాజ్ 1998లో ఢిల్లీలో జన్మించింది. అక్కడే పెరిగింది. ప్రస్తుతం ఆమె వయసు 25 సంవత్సరాలు. ఆమె మోతీ రామ్ మెమోరియల్ గ్రిల్స్ సీనియర్ స్కూల్ లో ప్రాధమిక విద్యను పూర్తిచేశారు. ఆ తర్వాత ఆమె బాచిలర్స్ ఇన్ జర్నలిజంని గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో చేశారు. ఆ తర్వాత జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టింది.
డిల్లీలో నివసిస్తున్న గరిమా భరద్వాజ్ 2021 ఆగస్ట్ నుండి ‘ది లలన్‌టాప్‌’ లో సబ్ ఎడిటర్ గా పనిచేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే గరిమా భరద్వాజ్ యశస్వీ జైస్వాల్ ను ఇంటర్వ్యూ చేసిన వీడియో వైరల్ అయిన తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్లు ఒక్కసారిగా పెరిగారు. ప్రస్తుతం ఆమెను 50 వేలకు పైగా ఫాలో అవుతున్నారు.

Also Read: తండ్రినే అమ్మకానికి పెట్టిన కొడుకు..! కారణం చూస్తే షాక్ అవ్వాల్సిందే..?