జబర్దస్త్ కామెడీ షో ద్వారా మనల్ని నవ్వించడమే తప్ప మరొకటి తెలియదు. వారు ఆ స్టేజ్ కి రావడానికి అనేక కష్టాలు పడ్డామని చెబుతూ ఉంటారు. ఒక్కోసారి ఆ స్టేజ్ పైనే వారి జీవితంలో జరిగిన విషయాలను తలుచుకుంటూ కన్నీరు పెట్టుకుంటారు. ఇలాంటి ఒక సంఘటనే పంచ్ ప్రసాద్ నుంచి ఎదురయింది. మరికొన్నాళ్ళు నాకు బతకాలని ఉందని కమెడియన్ పంచ్ ప్రసాద్ కన్నీరు పెట్టుకున్నారు. దీంతో వెంటనే అతన్ని దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకుని ఓదార్చారు సుధీర్.
జబర్దస్త్ కమెడియన్ లలో మంచి పేరు సంపాదించిన కమెడియన్ పంచ్ ప్రసాద్ అని చెప్పవచ్చు. ఈయన వెంకీ మంకీస్ జట్టులో తనదైన పంచులతో అందరినీ నవ్విస్తూ ఉంటాడు. అయితే ప్రసాద్ ఆరోగ్యంపై గత కొన్ని రోజుల నుంచి చాలా మంది అభిమా నులు ఆందోళన చెందుతున్నారు. దీనికి ప్రధాన కారణం అతని కిడ్నీలు 80% పాడైపో యాయి. ఇప్పటికీ రాంప్రసాద్ హెల్త్ విషమంగానే ఉన్నది. అయితే ఆయన త్వరలోనే సర్జరీ చేయించుకుని మామూలు మనిషి అవుతారని నాగబాబు గతంలో చెప్పారు.
ప్రసాదు పరిస్థితి చూసిన తర్వాత జబర్దస్త్ కుటుంబమంతా ఎవరికి కష్టం వచ్చినా ఆదుకోవాలనే రూల్ నాగబాబు పెట్టారట. కొన్నాళ్లు జబర్దస్త్ లో కనిపించిన ప్రసాద్ మళ్లీ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ప్రోమో లో కనిపించారు. రీసెంట్ గా బయటకు వచ్చిన ఈ ప్రోమో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ప్రోమో లో ఒక వ్యక్తి పంచ్ ప్రసాద్ అన్నకు పెద్ద అభిమాని అని చెబుతాడు. ఈ సందర్భంగా ఒక ప్రశ్న వేస్తాడు. మీరు ఒంటరిగా ఉన్న సమయంలో మీకు ఉన్న సమస్యను తలుచుకొని ఎప్పుడైనా బాధ పడ్డారా అని.. ప్రసాద్ కిడ్నీ సమస్య గురించి అడిగాడు.
దానికి ఆయన సమాధానం ఇస్తూ నేను ఏ రోజు కూడా బాధ పడలేదని ఒంటరిగా ఉన్న సమయంలో దాని గురించి అస్సలు ఆలోచించలేదని చెప్పాడు. దీంతో అభిమాని మీకు నిజంగా కిడ్నీ అవసరం ఉంటే మాత్రం నేను ఇవ్వడానికి సిద్ధమేనని అన్నాడు. దీంతో ప్రసాద్ నా కోసం ఇంత పనిచేసే అభిమానులు ఉన్నారా అంటూ ఫీల్ అయిపోయారు. దేవుడు ఇంకొన్ని రోజులు నాకు నవ్వించే ఛాన్స్ ఇస్తే బాగుండని ఎమోషనల్ అయ్యాడు. దీంతో సుధీర్ ప్రసాదును దగ్గరకు తీసుకొని ఓదార్చారు. దీంతో ఆ షో వచ్చిన వారంతా ఎమోషనల్ అయ్యారు.