Sudigali Sudheer: టీవీ షోల్లో కామెడీ చేసే ఒక వ్యక్తి వెండితెర పై హీరోగా నిలబడటం అంటే చిన్న విషయం కాదు. అది మామూలు విజయం కూడా కాదు. కానీ దాన్ని సుడిగాలి సుధీర్ సాధించాడు.
అతని పై ఎంతమంది వెకిలి కామెంట్స్ చేసినా కూడా, నవ్వుతూ వాటిని స్వీకరించే గొప్ప తత్వం ఉన్న సుడిగాలి సుధీర్ తగ్గి ఉంటూనే సక్సెస్ ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు తెలుగు టెలివిజన్ నటులకు ఎవరు పొందని విజయాన్ని గాలోడు సినిమా ద్వారా సుధీర్ అందుకున్నాడు. వాస్తవానికి గాలోడు సినిమా గొప్ప సినిమా ఏం కాదు. సుడిగాలి సుధీర్ బాగా బిల్డప్స్ ఇస్తున్నాడు.
అదేం ఇంప్రెస్ చేసే స్టోరీ కాదు. ఆ సినిమాలో కథనం సరిగ్గా లేదు, ఇలా చాలా కామెంట్స్ వినిపించాయి. కానీ గాలోడు సినిమా 11 రోజుల్లో 8 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోంది. ఈ సినిమాని 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదల చేస్తే, టార్గెట్ పూర్తి చేసి, లాభాల్లోకి వచ్చి, ప్రస్తుతం సూపర్ హిట్ దిశగా ముందుకెళ్తోంది. అయితే నిజానికి ఇది సుడిగాలి రేంజుకు చాలా పెద్ద విజయమే. ఇది పూర్తిగా సుధీర్ వ్యక్తిగత విజయం అని చెప్పాలి. బుల్లితెర పై తను తెచ్చుకున్న క్రేజ్ కూడా ఈ విజయానికి కారణం అయ్యింది.
వెండితెర పై కమెడియన్ పాత్రలు చేసే చాలామంది నటులు హీరోలుగా ప్రయత్నించి విఫలమైన ఉదంతాలు బోలెడు ఉన్నాయి. కానీ వాటిని పక్కన పెడితే సుడిగాలి సుధీర్ ఓ టీవీ షోలలో కామెడీ చేసే క్యారెక్టర్ మాత్రమే, ఈమధ్య కాలంలో టివి షోస్ కి హోస్టింగ్ కూడా చేస్తున్నాడు. సుధీర్ లో డాన్సర్, ఫైటర్ ఉన్నాడు. అయితే అన్నింటి కన్నా మంచి నటుడు ఉన్నాడు. అయితే సుధీర్‌కు సమయం కూడా కలిసొచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏమి లేకపోవడంతో గాలోడు సినిమాకు థియేటర్లు దొరికాయి. అయితే, పెద్ద పెద్ద హీరోల సినిమాలు డిజాస్టర్లు అవుతుంటే, ఒకప్పుడు అనామకుడు అని వెక్కిరింపుకు గురైన సుడిగాలి సుధీర్ హిట్ కొట్టాడు.

అయితే గత కొన్నేళ్లలో ఆడియెన్స్ అభిరుచుల్లో చాలా మార్పు వచ్చింది.మరి ముఖ్యంగా కరోనా తర్వాత ఆడియెన్స్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో చూడడానికి అలవాటు పడ్డారు. మిగతా భాషల సినిమాలు చూడడానికి అలవాడు పడ్డారు. ఈక్రమంలో పెద్ద స్టార్స్ నటించిన సినిమాలైనా కూడా కథ, కథనం బాగుందనే టాక్ వస్తే తప్ప చూడట్లేదు. అది కూడా థియేటర్స్‌లో మాత్రమే చూడాల్సిన సినిమా అంటేనే థియేటర్స్ కు వెళ్తున్నారు. లేకపోతే ఓటీటీలో వచ్చాక చూద్దాం అని అనుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో సుడిగాలి సుధీర్ నటించిన సినిమాకు మొదటి రోజు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ కూడా బాగా నమోదయ్యాయి. పెద్ద హీరోల మూవీస్ చూడటానికి పెద్దగా ఇష్టపడని ఆడియెన్స్ సుడిగాలి సుధీర్ సినిమా చూసేందుకు రావడం ఆసక్తికర విషయమే. తెలంగాణ,ఏపీలోని బీ,సీ సెంటర్స్‌లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ‘గాలోడు’ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.2.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.2.7 కోట్ల వరకు షేర్ ను రావాలి. ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకుంది. పదకొండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 4.38 కోట్ల వసూళ్లను రాబట్టింది.








