పండగ స్పెషల్ ఈవెంట్లలో సుడిగాలి సుధీర్ ఎందుకు కనిపించడం లేదు.. కారణం ఇదేనా..!

పండగ స్పెషల్ ఈవెంట్లలో సుడిగాలి సుధీర్ ఎందుకు కనిపించడం లేదు.. కారణం ఇదేనా..!

by Sunku Sravan

Ads

సుడిగాలి సుధీర్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. మెజీషియన్ గా తన కెరియర్ ప్రారంభించి జబర్దస్త్ షో తో మరింత పాపులర్ అయ్యారు. ఆయన చేసిన ఏ షో అయినా సరే చాలా ఫేమస్ అవుతుంది. అయితే ప్రతి ఏడాది ఈ టీవీ లో పండగల సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఆ కార్యక్రమాలను డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి టెలికాస్ట్ చేసేవారు. దీంతో ఆ కార్యక్రమానికి మంచి ఆదరణ వస్తుందని పెద్ద పెద్ద పండుగ అయిన ఉగాది, దసరా, సంక్రాంతి ఇలా మూడు నుంచి నాలుగు పండుగలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం చిన్న పండుగ వచ్చినా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైన్మెంట్ చేస్తు ఈటీవీ మల్లెమాల వారు ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Video Advertisement

శ్రీరామనవమి హోలీ, బోనాల పండుగ ఇలా చిన్నచిన్న ఫెస్టివల్స్ కు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేస్తూ ఈటీవీ కి భారీగా రేటింగ్ తెచ్చి పెడుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఈ సందర్భంలో పండగ స్పెషల్ కార్యక్రమాలు అయితే ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రతి పండుగకు దానికి సంబంధించినటువంటి స్పెషల్ కార్యక్రమం వస్తోంది. ఈ కార్యక్రమాలు అన్నింటిలో సుధీర్ చాలా స్పెషల్ గా చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో వచ్చే కార్యక్రమాల్లో సుడిగాలి సుధీర్ కనిపించడం లేదని ప్రేక్షకులు చాలా లోటుగా ఫీలవుతున్నారని తెలుస్తోంది.

 

శ్రీదేవి డ్రామా కంపెనీ లోని యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి సుధీర్ ఇతర కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నాడో కారణం తెలియలేదు. ప్రత్యేక కార్యక్రమాల్లో సుడిగాలి కనిపించక పోవడం వెనుక ఏదైనా ఉద్దేశం ఉందా లేకుంటే ఇతర షూటింగ్ ల కారణంగా హాజరు కావడం లేదా అనేది అభిమానుల్లో జరుగుతున్న చర్చ. స్పెషల్ కార్యక్రమాల్లో ఆయన లేకపోవడంతో చాలామంది ఇది చెత్త కార్యక్రమం అని అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే మల్లెమాల వారు సుధీరును తగ్గిస్తున్నారు కావచ్చని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ విషయానికి సుధీర్ మాత్రమే సమాధానం చెప్పగలరు.


End of Article

You may also like