సుశాంత్ సింగ్ రాజపుత్ బాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన చేరే స్థాయి ఉన్న ఒక నటుడు…అంచెలు అంచెలుగా ఎదుగుతూ…వస్తున్న సుశాంత్ ని బాలీవుడ్ లో కొందరు పెద్దలు ఎదగనివ్వకుండా అడ్డుకున్నారని…ఆరోపిస్తున్నారు సినీ అభిమానులు..అంతే కాదు ఆయన మరణాన్ని ఇప్పటికి వారు మరచిపోలేకున్నారు..ఆయన చేయవలసిన కొన్ని సినిమాల ఆఫర్లని సుశాంత్ తో అర్ధాంతరంగా విరమించుకున్నారని.
ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే..సుశాంత్ కి సంబంధించి ఆయన చేసిన చాల మంచి పనులు ఆయన మరణం తరువాత వెలుగులోకి వస్తున్నాయి..2018 వ సంవత్సరంలో ఒక ఫెయిర్నెస్ క్రీం కి సంబంధించి ఒక ప్రకటన ని (యాడ్) . వద్దనుకున్నారట. ఆ అడ్వేర్టైస్మెంట్ విలువ అక్షరాలా 15 కోట్ల రూపాయలు..ఆలా ఎందుకు చేయవలసి వచ్చిందంటే..సుశాంత్ సన్నిహితుల కథనం ప్రకారం..ఇలాంటి ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసడర్ గా నిలవటం సుశాంత్ కి నచ్చదట…ఎందుకనగా.
ఒక బాధ్యతగల నటుడిగా..తప్పుడు సందేశాల్ని ప్రజలకి ఇవ్వడం ఇది ముమ్మాటికీ తప్పే.ఒకరి స్కిన్ టోన్ ని కించపరచిన వారీగా నిలుస్తాము.ఇలాంటి ప్రోత్సహించకూడదు,ఆమోదించకూడదు.అని చెప్పే వారట.మూడు సంవత్సరాల వ్యవధిలో ఆరు ప్రకటనలని…వదులుకున్నారట..ఒక నటుడు ఇంత బాధ్యతాయుతంగా వ్యవహరించటం నిజంగా అభినందనీయం.ఇలా ప్రతి ఒక్కరు ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది కదా అంటున్నారు..నెటిజన్స్…ఏది ఏమైనా ఒక మంచి వ్యక్తిత్వం గల నటుణ్ని మనం కోల్పోయాం..అన్నది ముమ్మాటికీ నిజం.