ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ దాగి ఉంటుంది. చాలామంది ఆ కళ ను బయట పెట్టుకోవడం కోసం అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొందరు కుటుంబ పరిస్థితుల రిత్యా,బాధ్యతలు రిత్యా తమ కళని చంపుకుని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. చదువని, పెళ్లని, పిల్లలని, వారి పెళ్లిల్లని ఇలా జీవిత చక్రం కరిగిపోతూ ఉంటుంది. తీరా తీరిక దొరికేటప్పటికీ ఒంటిలో ఉన్న శక్తి అయ్యిపోతుంది. సమయం అయిపోతుంది.
అయితే ఆరు పదుల వయసులో కూడ ఉత్సాహాన్ని కనబరుస్తూ తమలోని టాలెంట్ ని బయట పెట్టుకుంటున్న వారు ఎందరో ఉన్నారు…ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎంతో మంది వెలుగులోకి వస్తున్నారు. ఒక సెల్ ఫోన్ సహాయంతో తమ ప్రతిభను బయటపెడుతున్నారు. వారిలో ఎంతోమంది నటులుగా మారిన వారు ఉన్నారు. అలాంటి ఒక ఆమె ఇంస్టాగ్రామ్ లో ఒక పేజ్ క్రియేట్ చేసుకుని తన వీడియోలు పెట్టడం మొదలు పెట్టింది.
ఆమె పేరు బత్తుల జ్యోతి. వయసు 60 పైబడి ఉంటుంది. ఒక్కసారి ఇంస్టాగ్రామ్ లో ఆమె పేజీని చూస్తే ఆమె ప్రతిభ ఏంటో మీకు అర్థమవుతుంది. పాత పాటలు, ఫన్నీ మాటలు ఇలా అన్ని రీల్స్ చేస్తూ పెడుతూ ఉంటారు. బహుశా ఆమెకి నటనంటే ఇష్టమై ఉండొచ్చు. కానీ బాధ్యతలు రిత్యా అవకాశం దొరకకపోయి ఉండొచ్చు.అయితే ఇప్పుడు తీరిక సమయం దొరకడం వల్ల ఆమె తనలోని ప్రతిభను బయట పెట్టుకునేందుకు ఒక ఇంస్టాగ్రామ్ పేజీని క్రియేట్ చేసి మీకు నచ్చితే ఫాలో చేయండి అంటూ చాలా వినయంగా అడిగారు.చాలామంది ఆమె ప్రతిభను మెచ్చుకుంటూ మంచి మంచి కామెంట్లు చేస్తున్నారు. మీరు ఇలాగే చేయండి, ఇంకా మంచిగా చేయండి అంటూ ప్రోత్సహిస్తున్నారు.
కానీ కొందరు ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు కూడా పెడుతున్నారు. ఈ వయసులో అవసరమా అంటూ. కళని బయట పెట్టుకోవడానికి వయసుతో సంబంధం ఏముంది. ఇంకా చెప్పాలంటే కామెంట్లు చేసేవారు ఆమె వయసు వచ్చేసరికి ఆమెలో ఉన్న ఉత్సాహం సగం కూడా ఉండదేమో. ఇంకా చెప్పాలంటే ఆమెలా చేసే ధైర్యం కూడా ఉండకపోవచ్చు. ఆమె కొటేషన్ కూడా నీకు నచ్చినట్టు జీవించు అని పెట్టారు. ఆమె ఎక్కడ అసభ్యంగా లేకుండా మంచి మంచి రీల్స్ చేస్తున్నారు.వీలైతే ఎంకరేజ్ చేయండి గానీ తప్పుగా కామెంట్లు మాత్రం పెట్టొద్దు.
watch video :
https://www.instagram.com/reel/CzQ4oT5pMtN/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==
Also Read:ఈ వ్యక్తి తెలియని తెలుగు వారు ఉండరు ఏమో..? ఇంత స్టైలిష్ గా అయిపోయారేంటి..?