Jai Balayya Song: నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న సినిమా వీరసింహారెడ్డి. తాజాగా ఈ మూవీ నుండి జై బాలయ్య సాంగ్ ని విడుదల చేశారు. అయితే ఈ పాటలో తమన్ వెరైటీ డ్రెస్ లో కనిపించారు. దీంతో తమన్ ని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.
మేకర్స్ సోషల్ మీడియాలో సినిమా కంటెంట్ బాగుంటే బాగా ప్రమోట్ చేసుకుంటారు. కంటెంట్ బాగుంటే నెటిజన్స్ కూడా సపోర్ట్ చేస్తారు.అయితే సినిమా బాలేనప్పుడు మాత్రం వాటిని ట్రోలర్స్ పని దొరికినట్టే ఇక.నెటిజెన్స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటారు. ప్రస్తుతం తమన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన వీరసింహారెడ్డి నుండి ఫస్ట్ సాంగ్ ‘జై బాలయ్య’ విడుదల చేసారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిచారు. అంతే కాకుండా ఈ లిరికల్ వీడియో సాంగ్ లో ఇప్పటివరకు వేసుకొని డ్రెస్ లో తమన్ కనిపించడమే కాకుండా స్టెప్స్ కూడా వేశారు.
అయితే అఖండ తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఈ పాటను నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని బాలయ్య అభిమానులు ఊహించుకున్నారు. కానీ ఈ పాట నిరాశ పరిచింది. అంతే కాకుండా ఒసేయ్ రాములమ్మ సినిమాలో పాటలా ఉందని ట్రోలింగ్స్ మొదలయ్యాయి.దీంతో నెటిజెన్స్ సోషల్ మీడియాలో తమన్ పై ట్రోల్స్ స్టార్ట్ చేశారు. మీమర్స్, ట్రోలర్స్ తమ చేతికి పని చెప్పారు. బ్రహ్మానందం ఫోటోలతో, వీడియోలతో రెచ్చి పోతున్నారు. డ్రెస్సింగ్ మీద పెట్టిన ఇంట్రెస్ట్, సాంగ్ మీద పెట్టలేదంటూ కామెంట్స్ పెడుతున్నారు.
బాలకృష్ణ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడు.రాయలసీమ బ్యాక్ డ్రాప్‌తో వస్తున్న ఈ మూవీలో శ్రుతీ హాసన్ హీరోయిన్. ఈ మూవీలో వరలక్ష్మి శరత్‌కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సంక్రాంతి 2023 కి థియేటర్స్‌లో సందడి చేయటానికి రెడీ అవుతోంది.
thaman music
థమన్ మళ్ళీ దొరికిపోయారు? భీమ్లా నాయక్ BGM మ్యూజిక్ కాపీ ఇదేనా ? సోషల్ మీడియా లో వైరల్ !
పవన్ కళ్యాణ్ హీరోగా మలయాళం రీమేక్ ‘అయ్యపనుం కోశియుమ్‘ ఇందులో విలన్ గా రానా దగ్గుబాటి కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ రే ఎంట్రీ తో ఫుల్ జోష్ లో పవన్ మరి హిట్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ చిత్ర యూనిట్ విడుదల చేశారు. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది.
కాగా పంద్రా ఆగష్టు సందర్బంగా ఇవాళ సినిమా ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ ని విడుదల చేసారు సినిమా కి సంగీతం అందిస్తున్న థమన్ ఈ టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్దర గొట్టారు ఊర మాస్ అంటూ పలువులు కామెంట్స్ చేస్తుంటే. కాదు ఈ సినిమా మ్యూజిక్ కాపీ అంటూ అప్పుడే ట్యూన్ లు బయటికి తీశారు.
ఈ భీమ్లా నాయక్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా పెట్ట సినిమా లో అచ్చం అలాగే ఉందంటూ వెతికి మరీ ట్రోల్ చేస్తున్నారు. థమన్ సినిమాలకి గతం లో కూడా ఇలాగె పలు మార్లు కాపీ ట్యూన్స్ అంటూ ట్రోల్ చేసారు. ఇక ఇప్పుడు వస్తున్న ఫీడ్ బ్యాక్ కి ఎలా స్పందిస్తారో చూద్దాం. ఇక ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవ్వనుంది. ఈ సినిమా తో పాటుగా మరో సినిమా సూపర్ మహేష్ హీరోగా సర్కారు వారి పాట కూడా విడుదల అవ్వనుంది. ఈ సంక్రాంతికి ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పక్క అన్నమాట. సో బెస్ట్ అఫ్ లక్ చెబుదాం.