భారత్ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి ప్రపంచమంతా తెలుసు. విరోచిత బ్యాటింగ్ కి వీరేంద్ర సెహ్వాగ్ పెట్టింది పేరు. సెహ్వాగ్ క్రీజ్ లో ఉన్నాడంటే అవతల పక్క ఏ బౌలర్ ఉన్నా సరే చెమటలు పట్టేవి. ఎవరైనా బ్యాట్స్ మెన్ క్రీజ్ లోకి వచ్చిన తర్వాత కాసేపు కుదురుకొని సిక్స్ లు, ఫోర్లు కొడతారు. కానీ అందరిలా ఉంటే సెహ్వాగ్ఎందుకు అవుతాడు. వచ్చి రాగానే సిక్స్ లేదా ఫోరు బాదుతాడు. అలా సెహ్వాగ్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన మ్యాచ్ లు ఎన్నో ఉన్నాయి.
ఏ బ్యాట్స్ మెన్ అయినా సెంచరీకి దగ్గర పడుతున్నారంటే కాస్త నెమ్మదిగా ఆడతాడు. కానీ సెహ్వాగ్ తీరే వేరు. సెంచరీ దగ్గరలో ఉండగా హిట్టింగ్ ఆడతాడు. సెహ్వాగ్ తీరు చూసి ఇండియన్ బ్యాట్స్ మెన్ సైతం ఆశ్చర్యపోయేవారు. సెహ్వాగ్ ను అవుట్ చేయడం అంత ఈజీ కాదని మేటి బౌలర్లే ఒప్పుకున్నారు.
కానీ పాకిస్తాన్ మాజీ బౌలర్ రానా నావెద్ ఉల్ హాసన్ సెహ్వాగ్ నీ అవుట్ చేయడం ఈజీనే అంటూ మాట్లాడాడు. అసలు విషయంలోకి వెళ్తే… రానా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… “2004-05 సంవత్సరంలో ఒక సిరీస్ జరుగుతుంది. ఆ సిరీస్ పాకిస్తాన్ లో జరిగింది. ఆ మ్యాచ్ లో సెహ్వాగ్ 85 రన్స్ దగ్గర ఆడుతున్నాడు. ఇండియా అప్పటికే 300 రన్స్ చేయిగా సెహ్వాగ్ హిట్టింగ్ లో ఉన్నాడు అని చెప్పాడు.అప్పుడు కెప్టెన్ ఇంజిమామ్ ని అడిగి తాను బౌలింగ్ తీసుకున్నానని, స్లో బౌన్సర్ వేసినట్లు తెలిపాడు. తన వెంటనే సెహ్వాగ్ దగ్గరికి వెళ్లి నీకు ఎలా ఆడాలో తెలీదు, నువ్వు పాకిస్తాన్ లో ఉన్నావు అని చెప్పినట్లు తెలిపాడు.
వెంటనే కెప్టెన్ ఇంజిమమ్ దగ్గరికి వెళ్లి నెక్స్ట్ బాల్స్ అవుట్ అవుతాడు అని చెప్పాడు. ఆశ్చర్యంగా తాను స్లో బాల్ వేయగా సెహ్వాగ్ హిట్టింగ్ ఆడటానికి ట్రై చేసి అవుట్ అయ్యాడని, ఆ వికెట్ తమకు చాలా ఇంపార్టెంట్ అని, ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ నెగ్గినట్లుగా గుర్తు చేసుకున్నాడు.
తాను ఇంకా మాట్లాడుతూ సెహ్వాగ్ కంటే రాహుల్ ద్రావిడ్ ను అవుట్ చేయడం చాలా కష్టతరం అని చెప్పాడు.
ఇదంతా విన్న భారత క్రికెట్ అభిమానులు పాకిస్తాన్ మాజీ బౌలర్ రానా పైన విరుచుకుపడుతున్నారు. సెహ్వాగ్ నీ బౌలింగ్ లో బాదిన బాదుడు మర్చిపోయావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎంతైనా పాకిస్తాన్ ఎప్పుడు ఇండియా మీద మీద పడి ఏడుస్తూనే ఉంటుందని కౌంటర్స్ వేస్తున్నారు.
Also Read:వరల్డ్ కప్ 2023 మీద ఉన్న ఈ 9 సింబల్స్ గమనించారా.? వాటికి అర్ధం ఏంటో తెలుసా.?