డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇప్పటికే f2, f3 సినిమాలు వచ్చి సంచలన విజయాన్ని అందుకున్నాయి.
ఈ తరుణంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ f4 సినిమా కూడా తెరకెక్కించే అవకాశం ఉందని అన్నారు. ఈ క్రమంలో f4 సినిమాలో వెంకటేష్ మరియు వరుణ్ తేజలు కనిపించరని సోషల్ మీడియా మరియు వెబ్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది.
F2సినిమాకు వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ ల పారితోషికాల పోల్చిచూస్తే, f3 లో ఎక్కువగా తీసుకున్నారని దీంతో సినిమాకు బడ్జెట్ బాగా ఖర్చు అయింది అని వార్తలు కూడా వచ్చాయి. ఈ సందర్భంలోనే f4 సినిమాకు కూడా బడ్జెట్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కారణాల వల్ల f4 సినిమా తెరకెక్కిస్తే మాత్రం ఈ మూవీలో వేరే హీరోలను తీసుకునే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది.
అయితే వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ కామెడీ టైమింగ్ వల్లే ఎఫ్ 3 మూవీ విజయవంతమైంది. అయితే f4 సినిమాలో ఈ హీరోలు లేకుండా తెరకెక్కిస్తే సినిమా రిజల్ట్ పై ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉండవచ్చని చెప్పవచ్చు. కానీ దిల్ రాజ్ అనిల్ రావిపూడి ఈ విషయంలో తప్పు చేయరని నెటిజన్లు అంటున్నారు. అయితే అనిల్ రావిపూడి ఇప్పటికే ఎన్నో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఆ సినిమాలు అన్ని పూర్తి అయిన తర్వాతనే f4 సినిమాపై దృష్టి పెట్టనున్నారు. దీనిపై దర్శకుడు అనిల్ క్లారిటీ ఇస్తే కానీ సమాధానం దొరికే అవకాశం లేదు. ఈ విధంగా డబుల్ హాట్రిక్ సాధించడంతో అనిల్ రావిపూడి రేంజ్ కూడా పెరిగింది. అలాంటి దర్శకుడు తర్వాత ప్రాజెక్టులలో సంచలన విజయాలు అందుకోవాలని ఫాన్స్ ఆశిస్తున్నారు.