Shweta Basu Prasad: శ్వేతా బసు ప్రసాద్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే.ఈ హీరోయిన్ ‘కొత్త బంగారులోకం’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే అమాయకత్వంతో కూడిన పాత్రలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ సినిమాలో శ్వేత బసు ప్రసాద్ ఎకడా అంటూ, తన అల్లరి చేష్టలతో గుర్తుండిపోయేలా నటించింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. శ్వేతా బసుకు వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ అవన్నీ ప్లాప్ అవడంతో, పాపులారిటీ ఎంత తక్కువ టైమ్ లో సంపాదించుకుందో, అంతే ఫాస్ట్ గా ఫేడ్ అవుట్ అయిపోయింది. శ్వేతా బసు చైల్డ్ యాక్టర్ గా హిందీ, బెంగాలీ సినిమాలలో నటించింది. అక్కడ పేరు సంపాదించింది.
బాలనటిగా శ్వేత బసు మొదటి హిందీ సినిమా ‘మక్డీ’ లో డబుల్ రోల్ చేసి అలరించిడమే కాక, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది. సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్న సమయంలో శ్వేత బసుకు జరిగిన ఒక ఇన్సిడెంట్ అప్పట్లో అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. ఆ సంఘటన ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అది జరిగిన తరువాత ఆమె బాలీవుడ్ కి వెళ్ళింది. అక్కడే ఉంటూ హిందీలో సీరియల్స్ లో నటిస్తూ, ఇంకో వైపు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పని చేసింది. శ్వేత బసు డిసెంబర్ 2018 లో ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్ ని వివాహం చేసుకుంది.కానీ ఏం జరిగిందో కానీ ఏడాదికే విడిపోయారు.
అయితే ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్టుంది. అందుకేనేమో ఇటీవల హాట్ ఫోటో షూట్లను షేర్ చేస్తూ, ఇన్‌స్టాలో హీట్ పెంచుతోంది. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే సంపాదించింది. తాజాగా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కోసం గోవా వెళ్లిన శ్వేత బసు బీచ్‌లో సందడి చేసింది. ‘ఇండియా లాక్డౌన్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మరియు ప్రమోషన్స్‌లోనూ అందాల ఆరబోతతో రచ్చ లేపింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్వేత బసును ఇన్‌స్టాగ్రామ్‌లో 440K ఫాలో అవుతున్నారు.

హీరో నితిన్ ఒక్క లుక్ తో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని హింట్ ఇచ్చాడని ఇండస్ట్రీలో టాక్. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్లో హీరో నితిన్ పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు వంశీ అండ్ టీం. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన పెండ్లిసందడి ఫేమ్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.
మాచర్ల నియోజకవర్గం సినిమా నితిన్‌కి ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. దీంతో నితిన్ ఈసారి మంచి హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడని ఫ్రెష్ లుక్ తో చెబుతున్నాడు.నితిన్ ఈ చిత్రంలో మాస్ అవతార్‌లో కనిపించబోతున్నాడని అర్థమవుతోంది.అయితే ఈ సినిమాలో ఒక్క ఎపిసోడ్ నే ఇలా కనిపిస్తాడని, సినిమా కథ వేరని సమాచారం. నితిన్ ఒక్క సన్నివేశం కోసమే గెడ్డం పెంచాడని టాక్ వినపడుతోంది. కొన్ని రోజులు అడవుల్లో తొలి షెడ్యూలు పూర్తి చేసి, ఆ తరువాత షూటింగ్ ని హైదరాబాద్ కు షిప్ట్ చేస్తారని, ఈ గెటప్, ఈ సీన్ కు, మిగిలిన కథకు ఉన్న సంబంధం ఏమిటో తెలియాల్సి వుంది. ఈ సినిమాకు సంగీతం హారిస్ జయరాజ్ అందిస్తున్నారు.
ఈమధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ‘బద్రి’ సినిమా సమయంలో ఇచ్చిన ఒక ఇంటర్వూ సోషల్ మీడియాలో షికారు చేసింది. తాజాగా 1998లో పవర్ స్టార్ ఇంటర్యూకి న్యూస్ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. అయితే పవన్ ఈ ఇంటర్యూలో పర్సనల్ మరియు వృత్తిపరమైన విషయాల గురించి కూడా చెప్పాడు. అందులో మీ మొదటి స్నేహితురాలు ఎవరని అడిగితే ఆరోజుల్లో నాతో మాట్లాడటానికి ఏ అమ్మాయి కూడా ఆసక్తి చూపించేవారు కాదని, నాలో స్పెషల్ ఏం లేదని ఆయన తెలిపాడు. ఇంకా చెప్తూ చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ అయస్కాంత ముక్కలు తెలీకుండా తీసుకున్న విషయం చెప్పాడు.
కానీ అప్పుడు చేసినదానికి ఇప్పటికీ కూడా ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది అని బాధ పడుతూనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. దేవదాసు సినిమాలోని అంతా భ్రాంతియేనా సాంగ్ , దాని సాహిత్యం, ట్యూన్ అంటే చాలా ఇష్టమనీ, ఆ ఇంటర్వూలో ఇంట్రెస్టింగ్ విషయాలను పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆ ఇంటర్వూ వచ్చిన న్యూస్ పేపర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను 2023 సమ్మర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా త్రివిక్రమ్ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఇక ఈ లగ్జరీ కారు ఖరీదు రూ. 1.34 కోట్లు అని తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ గ్యారేజీలో లగ్జరీ కార్లు ఉన్నాకూడా, తాజాగా కొత్త కారును కొన్నారు. త్రివిక్రమ్ బీఎండబ్ల్యూ కారు కొంటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న కారు రంగును చూస్తే, BMW 7 సిరీస్ 740 లీటర్ మోడల్ కారుగా అంచనా వేయబడింది. కారు ఖరీదు విని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ బీఎండబ్ల్యూ కారును తన భార్యకు బహుమతిగా ఇచ్చారని సమాచారం.
డైరెక్టర్ త్రివిక్రమ్ భార్య సౌజన్య మంచి క్లాసికల్ డ్యాన్సర్. ఆమె ఇప్పటికే చాలా వేదికలపై తన నృత్య ప్రదర్శన చేసారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో చేస్తున్న సినిమా పూర్తి అయిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం త్రివిక్రమ్, మహేష్ SSMB28 సినిమాలో సీనియర్ హీరోయిన్ శోభన ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతుంది.