హాస్పిటల్ లో హీరో “అబ్బాస్”..! అసలు ఏమైంది..?

హాస్పిటల్ లో హీరో “అబ్బాస్”..! అసలు ఏమైంది..?

by kavitha

Ads

హీరో అబ్బాస్, ఇప్పటి యుత్ కి తెలియకపోవచ్చు. కానీ 90వ దశకంలో లవర్ బాయ్ అబ్బాస్. అందులోనూ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమానే ప్రేమదేశం. అయితే కొన్ని సినిమాలు ఎన్ని సంవత్సరాలు గడిచిన వాటి క్రేజ్‌ ఎప్పటికీ తగ్గదు. అలాంటి సినిమాలలో ప్రేమదేశం సినిమా కూడా ఉంటుంది.

Video Advertisement

డైరెక్టర్ కదీర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు హీరో అబ్బాస్‌. ముఖ్యంగా చెప్పాలంటే అబ్బాస్ కు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన అబ్బాస్‌, తన సినీకెరీర్‌కు 2015లో విరామం ఇచ్చి, కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లి, అక్కడే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా స్తిరపడ్డాడు.

abbas

అయితే చాలా కాలంగా సినీ పరిశ్రమకు, సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉండే అబ్బాస్ సడెన్ గా ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న తన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్ కి షాకిచ్చాడు. దాంతో అసలు అబ్బాస్ ఏం జరిగింది అంటూ కామెంట్స్ నెటిజన్స్ చేస్తున్నారు .

అయితే తాజాగా అబ్బాస్ సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో హాస్పటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫొటోను అబ్బాస్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి, ‘ఆస్పత్రిలో ఉన్న టైమ్ లో నా మనసంతా గందరగోళంగా ఉంది. దానినీ అధిగమించేందుకు ఎంతగానో ప్రయత్నించాను. శస్త్ర చికిత్స అనంతరం కొంచెం ఉపశమనం కలిగింది. నా కోసం ప్రార్థించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు’ అని ఫేస్‌బుక్‌లో అబ్బాస్‌ రాసుకొచ్చాడు .

 


End of Article

You may also like