HIT-3: అడివి శేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్స్ గా వచ్చిన లేటెస్ట్ సినిమా హిట్ 2. ఈ సినిమాని నాచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా ఇటీవలే ఆడియెన్స్ ముందుకి వచ్చి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా రూ. 28 కోట్లకు పైగా వసూల్ చేసి, చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెంట్ చేసింది. దర్శకుడు శైలేష్ హిట్ 2 సినిమాని యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లింగ్ గా తెరకెక్కించారు. ఈ మూవీకి ప్రేక్షకులతో పాటు, సినీ ప్రముఖులు నుంచి కూడా అభినందనలు రావడంతో ఈ చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.

అసలు విషయం ఏమిటంటే, ఆడియెన్స్ తమకు ఇంత సక్సెస్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని, అలాగే రాబోయే సినిమాలో అంటే దీనికి సీక్వెల్ అయిన హిట్ 3 ని ఇంతకంటే ఎక్కువగా, అద్భుతంగా తీస్తానని ప్రేక్షకులకి సోషల్ మీడియా ద్వారా మాట ఇస్తూ శైలేష్ కొలను పోస్ట్ పెట్టారు. ఖచ్చితంగా హిట్ 3 మరో రేంజ్ లో ఉంటుందని చెప్పారు.
ఇక ఈ సినిమాలో హీరో నాని అర్జున్ సర్కార్ అనే పేరుగల పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడని, సినిమా పూర్తి వివరాలను త్వరలో తెలియచేస్తామని చెప్పారు. ఇదివరకే దర్శకుడు శైలేష్ కొలను హిట్ వర్స్ ని ఎవెంజర్స్ మాదిరిగా చేస్తామని స్పష్టం చేశాడు. అంటే ఎవెంజర్స్ మూవీస్ లో ఒకేదానిలో ఇద్దరు ముగ్గురు హీరోస్ ఉంటారో, అలాగే హిట్ రాబోయే సిరీసుల్లో కూడా ఒకరు కంటే ఎక్కువ హీరోలు కనిపిస్తారని చెప్పారు. మరో విధంగా చెప్పాలంటే మల్టీస్టారర్ మూవీ అనవచ్చు.
ఇక హిట్-3లో నాచురల్ స్టార్ నానినే హీరో అనే విషయం తెలిసిందే. హిట్-2 సినిమా క్లైమాక్స్ లో ఆ విషయాన్ని చూపించారు. హీరో నానిని పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ గా ఇంట్రడ్యూస్ చేసారు. దీని ప్రకారం హిట్-3లో నానినే హీరో. అయితే తాజాగా శైలేష్ కొలను పెట్టిన పోస్ట్ తో నానితో పాటు అడివి శేష్, విశ్వక్ సేన్ లు ఈ సినిమాలో నటించే అవకాశం కనిపిస్తోంది.

తమిళంలో విజయం పొందిన క్లాసిక్ ‘ఓ మై కడువులే’ మూవీకి రీమేక్‌గా ఈ సినిమా వచ్చింది. విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమా ఫాంటసీ రొమాంటిక్ కామెడీ చిత్రం. వెంకటేష్ మోడ్రన్ దేవుడిగా నటించి మెప్పించారు. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే పాత్రలో విశ్వక్ సేన్ నటించాడు.మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్స్‌గా నటించారు. దీనిని పెరల్ వి. పొట్లూరి మరియు పరమ్ వి. పొట్లూరి పివిపి సినిమా బ్యానర్‌పై నిర్మించారు. మరియు అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాశారు.
ఓరి దేవుడా ఏరియా వైజ్ వసూళ్లు చూస్తే, నైజాంలో రూ.2.06 కోట్లు, రాయలసీమ రూ. 0.56 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 0.78 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 0.21 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 0. 29 లక్షలు,కృష్ణ రూ. 0.47 లక్షలు, గుంటూరు రూ. 0.38 లక్షలు, నెల్లూరు రూ. 0.12 లక్షలు, ఏపీ, తెలంగాణ కలిపి రూ. 4.87 కోట్లు, UA: రూ 0.78 కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా మొత్తంగా పైనల్ కలెక్షన్స్ రూ. 5.72 కోట్లు (రూ. 10.50 కోట్ల గ్రాస్).