Ori Devuda: ”ఓరి దేవుడా” ఫైనల్ కలెక్షన్స్..! ఇంతకీ వచ్చింది లాభామా..? నష్టమా..?

Ori Devuda: ”ఓరి దేవుడా” ఫైనల్ కలెక్షన్స్..! ఇంతకీ వచ్చింది లాభామా..? నష్టమా..?

by kavitha

Ads

Ori Devuda Closing Collections: ప్రముఖ నిర్మాత పివిపి నిర్మించిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిథిలా పాల్కర్ మరియు ఆశా భట్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా పాజిటివ్ బజ్‌తో బాక్సాఫీస్ ప్రయాణాన్ని ప్రారంభించింది. వెంకటేష్ దేవుడి పాత్రలో నటించిన ఈ సినిమా విడుదల రోజున సినీ ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.

Video Advertisement

అయితే ఈ సినిమాకి టాక్ బాగున్నా, దానికి తగ్గ కలెక్షన్స్‌ను రాబట్టలేకపోయింది. అక్టోబర్ 11 నుండి ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఓరి దేవుడా థియేట్రికల్ రన్ ముగిసింది. ఇక సినిమా ఎంత వసూల్ చేసిందనే విషయానికొస్తే, తాజా రిపోర్ట్ ప్రకారం ఓరి దేవుడా ఫుల్ రన్ లో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 5.72 కోట్ల షేర్ రాబట్టింది. రూ. 10.50 కోట్ల గ్రాస్. బ్రేక్ ఈవెన్: రూ. 6 కోట్లు, సినిమాకి వచ్చిన మొత్తం నష్టం: రూ. 0.28 కోట్లు.
oridevuda 1 telugu addaతమిళంలో విజయం పొందిన క్లాసిక్ ‘ఓ మై కడువులే’ మూవీకి రీమేక్‌గా ఈ సినిమా వచ్చింది. విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమా ఫాంటసీ రొమాంటిక్ కామెడీ చిత్రం. వెంకటేష్ మోడ్రన్ దేవుడిగా నటించి మెప్పించారు. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే పాత్రలో విశ్వక్ సేన్ నటించాడు.మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్స్‌గా నటించారు. దీనిని పెరల్ వి. పొట్లూరి మరియు పరమ్ వి. పొట్లూరి పివిపి సినిమా బ్యానర్‌పై నిర్మించారు. మరియు అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ద‌ర్శకుడు త‌రుణ్ భాస్కర్ డైలాగ్స్ రాశారు.
ori devuda-telugu addaఓరి దేవుడా ఏరియా వైజ్ వసూళ్లు చూస్తే, నైజాంలో రూ.2.06 కోట్లు, రాయలసీమ రూ. 0.56 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 0.78 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 0.21 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 0. 29 లక్షలు,కృష్ణ రూ. 0.47 లక్షలు, గుంటూరు రూ. 0.38 లక్షలు, నెల్లూరు రూ. 0.12 లక్షలు, ఏపీ, తెలంగాణ కలిపి రూ. 4.87 కోట్లు, UA: రూ 0.78 కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా మొత్తంగా పైనల్ కలెక్షన్స్ రూ. 5.72 కోట్లు (రూ. 10.50 కోట్ల గ్రాస్).


End of Article

You may also like