విజ్ఞానాన్ని పెంచుకోవడం కోసం వివిధ రకాల నైపుణ్యాలను మెరుగు పంచుకోవడం ద్వారా వృత్తిలో అభివృద్ధిని సాధించడం కోసం మనిషి విద్యను అభ్యసించడం ప్రారంభించాడు కానీ పరిణామక్రమంలో మనిషి తాను నేర్చుకున్న విద్యను ఎదుటివారికి తెలియజేయడం ద్వారా తన గొప్పదనం ఎదుటివారికి తెలుస్తుంది అనుకోవడం ప్రారంభించారు. సాధారణమైన డిగ్రీ చదివిన వారే తమ పేరుని దాని పక్కన తమ చదువుని రాయడం చూస్తూనే ఉంటాం అలాంటిది ఎస్.పి స్థాయిలో ఉన్నప్పటికీ తన చాంబర్లో ని నేమ్ ప్లేట్ బోర్డ్ పై తన పేరు రాయడానికి బదులుగా దానిపై దయచేసి కూర్చోండి అని రాసి వచ్చిన వారికి మర్యాద తెలియజేస్తున్నారు ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన ఎస్.పి సిద్ధార్థ్ కౌశల్.
అంతేకాకుండా స్పందన కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చిన వారందరితో చాలా ఓపికగా మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ వచ్చిన వారితో చాలా మర్యాదగా ప్రవర్తించారు. ప్రజలకు సేవ చేయడానికే పోలీస్ శాఖ ఉన్నదని ప్రజలకు ఎటువంటి కష్టం కలిగినా పోలీస్ శాఖ వారు కచ్చితంగా స్పందిస్తారని, అది తమ బాధ్యత అని ఆయన తెలియజేశారు. కొన్ని కొన్ని ఘటనలలో పోలీసు వారిని చూసినప్పుడు ప్రజలకి భయం ఏర్పడినప్పటికీ ఇలాంటి పోలీసు వారిని చూసినప్పుడు వారిపై గౌరవం పెరుగుతుంది