కోర్టుల్లో నిత్యం ఎన్నో వందల వేల సంఖ్యలో కేసులు వాస్తు ఉంటాయి.వాటిని విచారించటానికి ఎన్నో ఏళ్ళు పడుతూ ఉంటాయి కూడా.ఈ క్రమం లో ప్రజలకి తీర్పు రావటానికి చాల కాలం పడుతూ ఉంటుంది.నిన్న బాంబే హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం కనీ వినీ ఎరుగని రీతిలో ఏకదాటిగా 12 గంటల వ్యవధిలో సుమారు 80 కేసులు విన్న ప్రత్యేక ధర్మాసనం ఉదయం 10.45 గంటలకు విచారణను ప్రారంభించిన జస్టిస్ ఏజే కథావాలా, జస్టిస్ ఎస్పీ తావ్డేలతో రాత్రి 11 .15 వరకు విచారణలు కొనసాగించారు.
bombay-high-court (1)
కనీసం భోజన విరామం కూడా తీసుకోకుండా న్యాయమూర్తులు కేవలం టీ విరామం తోనే వాదనలు పూర్తి చేసారు.గతం లో కూడా జస్టిస్ కథావాలా సుదీర్ఘంగా విచారణలు చేపట్టారు.మే 2018 వేసవి సెలవులకి ముందు రోజు తెల్లవారుజామున 3 30 గంటల వరకు సుదీర్ఘ విచారణలు చెప్పట్టారు. అవినీతి ఆరోపణలు ఎదురుకుంటున్న మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ లతో పాటు మరి కొన్ని ముఖ్య మినా కేసుల్ని విచారణ చేపట్టింది బాంబే హైకోర్టు.
ఇది చదవండి : మనం ఎవరికి పంపించాలి అనుకుంటున్నామో…సరిగ్గా వారికే “పావురాలు” ఉత్తరాలు ఎలా చేర్చేవి.?