ఈ మధ్య కాలం లో మొబైల్ ఫోన్ లు ఎక్కువ గా పేలుతున్నాయని వార్తలు వస్తున్నాయి. దీనితో స్మార్ట్ ఫోన్ యూజర్లు కొంత అప్రమత్తం గానే ఉండాల్సి వస్తోంది. దీనికి కారణం మొబైల్ ను ఎక్కువ గా వినియోగించడం, ఎక్కువ సేపు ఛార్జ్ చేస్తుండడం కూడా కావచ్చు. మీ మొబైల్స్ పేలకుండా ఉండాలి అంటే ఈ జాగ్రత్తలు తీసుకోక తప్పదు.

mobile

మీ మొబైల్ ని ఓవర్ నైట్ ఛార్జ్ చేయకండి. ఛార్జింగ్ పెట్టిన సమయం లో ఫోన్ ని గమనించండి. ఒకవేళ బాగా వేడిగా ఉన్నట్లు అనిపిస్తే.. వెంటనే ఛార్జింగ్ లోంచి తీసేయడం ఉత్తమం. అలాగే మొబైల్ ని ఛార్జింగ్ లో ఉంచి చాటింగ్ చేయడం, గేమ్స్ ఆడడం వంటి పనులు చేయొద్దు. అలాగే ఫోన్ ను ఎండపడే చోట ఉంచి ఛార్జింగ్ చేయడం కూడా మంచిది కాదు.