హాస్పిటల్ లో ఓ కరోనా బాధితురాలు బయటపెట్టిన విషయాలు ఇవి..! పరిస్థితి చూస్తే మీకే అర్ధం అవుతుంది!

హాస్పిటల్ లో ఓ కరోనా బాధితురాలు బయటపెట్టిన విషయాలు ఇవి..! పరిస్థితి చూస్తే మీకే అర్ధం అవుతుంది!

by Anudeep

Ads

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ థాటికి ఇప్పుడు అగ్రరాజ్యాలే వణికిపోతున్నాయి. చైనాలోని వూహాన్లో కరోనా కేసులు తగ్గాయి అని సంతోషించేలోపే మళ్లీ కొత్త కేసులు నమోదవడం, కోలుకున్న వారిలోనే మళ్లీ పాజిటివ్ రావడం అనే వార్తలు భయపెడుతున్నాయి. మరో వైపు అమెరికాలో కూడా పరిస్థితి చేయి దాటిపోయింది.. ఇటలీ పరిస్థితి  మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది..లేకపోతే కరోనా వైరస్ సోకడానికి కంటే ముందు భయంతో పోతాం .

Video Advertisement

అసలు కరోనా వైరస్ లక్షణాలేంటి దగ్గు,జలుబు, జ్వరం మరియు తలనొప్ప ఇవే కదా ..దానికి అంత భయపడాల్సిన  అవసరం ఏముంది అని చాలా మంది కొట్టిపారేస్తున్నారు. అందుకే ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించినా లెక్క చేయట్లేదు. దీంతో పోలీసులు అధికారం తమ చేతుల్లోకి తీసుకుని కొట్టైనా ఇంట్లో కూర్చొబెట్టాలనుకుంటున్నారు. కాని ఒకసారి కరోనా బాధితురాలు ఏం చెప్పిందో తెలుసా? తన కళ్లల్లో భయాన్నిచూడండి , మాటల్లో బాధని వినండి..ఎంత కష్టంగా ఉంటుందో తెలుసుకోండి.

“నేను ఇలా అవుతానని నా వాళ్లు కాని , నేను కాని అస్సలు ఊహించలేదు. వెంటిలేటర్ పైన ఉంటే తప్ప శ్వాస తీస్కోవడానికి అవ్వట్లేదు. ఇప్పటికే చేతులకి పదుల సంఖ్యలో సిరంజిలు గుచ్చారు. గుండె వేగంగా కొట్టుకుంటోంది, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ముందుకంటే ఇప్పుడు నా పరిస్థితి పదిరెట్లు నయం. అయినా కూడా నేను బతుకుతానో లేదో తెలియదు. దయచేసి కరోనాని తక్కువ అంచనా వేయకండి అంటూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ వేడుకుంటోంది. ఆ  వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది.

కరోనా వస్తే చనిపోవడం అనేది ఉండదు కదా అని చాలా మంది లైట్ తీస్కుంటున్నారు . ముసలి వాళ్లకి, చిన్నపిల్లలకే కష్టం అంట మనకి ఏం కాదంటా అని అనుకుంటున్నారు. కాని ఒక్కసారి ఒక నిమిషం పాటు ముక్కు, నోరు మూస్కుని శ్వాస తీస్కోవడం ఆపేయండి . ఎంత భయంకరంగా ఉంది కదా.. అలాంటిది శ్వాస తీస్కోవడానికి ఇబ్బంది, ఎడతెరిపిలేని దగ్గు ఇంకెంత బాధ పెడతాయి. అందుకే ఆలోచించండి అలాంటి నరకం మనకొద్దు , జాగ్రత్తలు పాటిద్దాం మన ఆరోగ్యంతో పాటు అందరి ఆరోగ్యం కాపాడుకుందాం.

watch video:


End of Article

You may also like