Home Filmy Adda “మ..మ.. మహేశా” ట్యూన్ కాపీ చేయడంపై స్పందించిన తమన్.. ఏమన్నారంటే?

“మ..మ.. మహేశా” ట్యూన్ కాపీ చేయడంపై స్పందించిన తమన్.. ఏమన్నారంటే?

by Anudeep

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా భారీ అంచనాల నడుమ మే 12వ తేదీన థియేటర్లలోకి రానుంది. దీనిపై ప్రేక్షకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.

మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా సినిమాకి చాలా హైప్ క్రియేట్ చేస్తున్నారు. పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు అత్యంత కీలకమైన చిత్రం అని చెప్పవచ్చు.

sarkaru vaari paata review

అయితే ఈ సినిమాలోని ఒక మాస్ సాంగ్ మామ మహేష్ మే 7వ తేదీన రిలీజ్ అయింది. అయితే ఈ పాటకు తమన్ సంగీతాన్ని సమకూర్చారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. అయితే ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అవుతోంది. మ మ మహేష్ సాంగ్ చాలా బాగుంది కానీ ఆ ట్యూన్ కాపీ కొట్టారని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

taman

అయితే ఈ ట్రోలింగ్ పై తమన్ స్పందించారు. “ఈ పాట మరో పాట ట్యూన్ కి దగ్గరగా ఉందని తమకు నిజంగా తెలియదని చెప్పుకొచ్చారు. తమ టీం లో 14 మంది ఉన్నారని.. వారిలో ఎవరికీ తెలిసినా అది రిపీటెడ్ ట్యూన్ అని చెప్పేవారని.. అంతే కాకుండా సెర్చింగ్ యాప్స్ ఉన్నాయని.. వాటిల్లో అయినా అది కాపీ ట్యూన్ అని తెలిసేది చెప్పుకొచ్చారు. నిజంగానే ఈ పాటకి ట్యూన్ చేస్తున్న సమయంలో.. ఆ పాట మరో పాటకి దగ్గరగా ఉందన్న ఆలోచనే తమకి రాలేదని చెప్పుకొచ్చారు.

 

You may also like