TAMANNA: కామాక్య ఆలయంలో తమన్నా పూజలు.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

TAMANNA: కామాక్య ఆలయంలో తమన్నా పూజలు.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

by Harika

Ads

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న తమన్నా సోషల్ మీడియాలో కొంతకాలంగా హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ప్రస్తుతం ఆమె బిజీబిజీగా ఉంటోంది. సినిమా లేదా వెబ్‌ సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకు వస్తోంది.

Video Advertisement

ఇటీవల తమన్నా తన కుటుంబ సభ్యులతో కలిసి గౌహతిలోని ప్రఖ్యాత కామాక్య ఆలయాన్ని సందర్శించింది.కామాక్య ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. ఈ సందర్భంగా పసుపు రంగు చుడీదార్, మెడలో హారం, శాలువా, నుదుటిపై కుంకుమతో ఎంతో ట్రెడిషినల్‌గా కనిపించిందీ మిల్కీ బ్యూటీ.నా ప్రియమైన వారితో కొన్ని మధురమైన భక్తి క్షణాలు గడిపాను అంటూ తమన్నా ఈ టెంపుల్ విజిట్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో షేర్ చేసుకుంది.

గతంలో ఇషా ఫౌండేషన్‌ అధ్వర్యంలో జరిగిన శివరాత్రి, సంక్రాంతి, లింగ భైరవి దేవి పూజల్లో కూడా తమన్నా పాల్గొంది. అలాగే తన దైనందిన జీవితంలో ధ్యానం, యోగా , ప్రాణాయామం ఒక భాగంగా చేసుకుంది. తమన్నా బాలీవుడ్ నటుడు విజయవర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే త్వరలో తమన్నా విజయ్ పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆలయాలను సందర్శిస్తుందని కూడా అంటున్నారు.


End of Article

You may also like