Ads
చాలా మంది దొంగలు దొంగతనం చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. దొంగతనం చేయడం ఒకెత్తయితే.. చేసాక దొరక్కుండా ఉండడం మరో ఎత్తు. ఈ క్రమం లోనే వారు తమ జాగ్రత్తల్లో తాము ఉంటారు. అయితే.. తమిళనాడు కు చెందిన ఈ దొంగ మాత్రం దొంగతనం చేయబోయి పప్పులో కాలేసాడు.
Video Advertisement
ఈ మధ్య కాలం లో ఏటీఎం దొంగతనాలను చూస్తూనే ఉన్నాం. ఏటీఎం రూమ్ లలో ఎవరు లేని/రాని సమయం చూసుకుని దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. వీరు సాధారణం గా మెషిన్ ను పగలగొట్టి డబ్బుని తీసుకుపోవాలని చూస్తారు. కానీ ఈ తమిళనాడు దొంగ తెలివి తేటలు వేరే లెవెల్ లో ఉన్నాయి. దొంగతనం చేయడం కోసం మెషిన్ లోపలకు దూరిపోయాడు.
డబ్బు తీసుకుని పారిపోదాం అనుకున్నాడు కానీ, బయటకు రాలేక అవస్థ పడ్డాడు. ఈ క్రమం లోనే స్థానికులు బయటకు రాలేక అవస్థ పడుతున్న దొంగను చూసేసారు. ఎవరో పోలీసులకు సమాచారం అందించడం తో.. వారు కూడా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎరక్కపోయి ఇరుక్కున్న ఈ దొంగను పట్టుకుని విచారణ చేస్తున్నరు. మరో వైపు.. ఈ దొంగ స్టోరీ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
End of Article