Home News దొంగతనం చేద్దామని ఏటీఎం మెషిన్ లోపలకు దూరిపోయాడు.. బయటకు రాలేక అవస్థ.. తరువాత ఏమైందంటే..?

దొంగతనం చేద్దామని ఏటీఎం మెషిన్ లోపలకు దూరిపోయాడు.. బయటకు రాలేక అవస్థ.. తరువాత ఏమైందంటే..?

by Anudeep

చాలా మంది దొంగలు దొంగతనం చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. దొంగతనం చేయడం ఒకెత్తయితే.. చేసాక దొరక్కుండా ఉండడం మరో ఎత్తు. ఈ క్రమం లోనే వారు తమ జాగ్రత్తల్లో తాము ఉంటారు. అయితే.. తమిళనాడు కు చెందిన ఈ దొంగ మాత్రం దొంగతనం చేయబోయి పప్పులో కాలేసాడు.

tamilanadu thief

ఈ మధ్య కాలం లో ఏటీఎం దొంగతనాలను చూస్తూనే ఉన్నాం. ఏటీఎం రూమ్ లలో ఎవరు లేని/రాని సమయం చూసుకుని దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. వీరు సాధారణం గా మెషిన్ ను పగలగొట్టి డబ్బుని తీసుకుపోవాలని చూస్తారు. కానీ ఈ తమిళనాడు దొంగ తెలివి తేటలు వేరే లెవెల్ లో ఉన్నాయి. దొంగతనం చేయడం కోసం మెషిన్ లోపలకు దూరిపోయాడు.

tamilanadu thief 2

డబ్బు తీసుకుని పారిపోదాం అనుకున్నాడు కానీ, బయటకు రాలేక అవస్థ పడ్డాడు. ఈ క్రమం లోనే స్థానికులు బయటకు రాలేక అవస్థ పడుతున్న దొంగను చూసేసారు. ఎవరో పోలీసులకు సమాచారం అందించడం తో.. వారు కూడా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎరక్కపోయి ఇరుక్కున్న ఈ దొంగను పట్టుకుని విచారణ చేస్తున్నరు. మరో వైపు.. ఈ దొంగ స్టోరీ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

You may also like